iDreamPost
android-app
ios-app

చిన్మయి కాపురంలో చిచ్చు.. నందినీ రెడ్డితో చాటింగ్ షేర్ చేసిన రాహుల్!

  • Published Jan 02, 2024 | 4:28 PM Updated Updated Jan 02, 2024 | 4:28 PM

Rahul Ravindran: ఇండస్ట్రీలో కొంతమంది నటీ నటులు.. దర్శకులు ఫ్రెండ్స్ గా ఉంటూ ఉండడం సజహం. అప్పుడప్పుడు వారికీ సంబంధించిన ఫొటోస్ ను కూడా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో డైరెక్టర్ నందిని రెడ్డికి .. ఫేమస్ యాక్టర్ కు మధ్య జరిగిన చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

Rahul Ravindran: ఇండస్ట్రీలో కొంతమంది నటీ నటులు.. దర్శకులు ఫ్రెండ్స్ గా ఉంటూ ఉండడం సజహం. అప్పుడప్పుడు వారికీ సంబంధించిన ఫొటోస్ ను కూడా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో డైరెక్టర్ నందిని రెడ్డికి .. ఫేమస్ యాక్టర్ కు మధ్య జరిగిన చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

  • Published Jan 02, 2024 | 4:28 PMUpdated Jan 02, 2024 | 4:28 PM
చిన్మయి కాపురంలో చిచ్చు.. నందినీ రెడ్డితో చాటింగ్ షేర్ చేసిన రాహుల్!

సినీ ఇండస్ట్రీలో ఈ సెలబ్రిటీ కపుల్ చాలా ఫేమస్. అటు  సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆమె.. ఓ నటుడిగా, దర్శకుడిగా అతను.. మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ సెలబ్రిటీ కపుల్ మరెవరో కాదు రాహుల్ రవీంద్రన్, చిన్మయి శ్రీపాద. ఈ జంటకు ఇండస్ట్రీలో చాలా మందితో మంచి స్నేహం ఉంది. వారిలో నందిని రెడ్డికి ఈ జంటకు ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే నందిని రెడ్డి.. రాహుల్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్తూ ఓ మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ ను స్క్రీన్ షాట్ తీసి రాహుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనితో ఇప్పుడు ఈ పోస్ట్ కాస్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకీ నందిని రెడ్డి పంపించిన మెసేజ్ లో ఏముందంటే “రాహులా.. ఈ ఏడాది నీకు అద్భుతమైన గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది..పక్కా దీనికి నీ భార్య కూడా అంగీకరిస్తుంది” అంటూ మెసేజ్ పెట్టింది. దీనిని రాహుల్ స్క్రీన్ షాట్ తీసి “నందినీ తప్పా ఇంకెవ్వరూ ఇలా విషెస్ చెప్పలేరు ” అంటూ హాస్యాస్పదంగా ఎక్స్ లో పోస్ట్ చేశాడు. దీనితో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పదించడం మొదలుపెట్టారు. వీరిద్దరూ చేసిన ట్వీట్స్ మీద నెట్టింట ముచ్చట్లు స్టార్ట్ అయ్యాయి. రాహుల్ రవీంద్రన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కొందరు.. ఫన్నీ విషెస్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. పైగా ఈ స్క్రీన్ షాట్ చూసిన నెటిజన్లు ఆ ఫొటోలో ఉన్న మేటర్ ని మాత్రమే కాకుండా ఇంకా మిగిలిన విషయాలు కూడా గమనిస్తున్నారు.

రాహుల్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ లో 1100కి పైగా మెసెజ్‌లకు పైగా ఉన్నాయి. ఇక దీని గురించి కూడా అడగడం మొదలెట్టారు నెటిజన్లు. రాహుల్ కూడా ప్రతి కామెంట్ కు తగిన రిప్లై ఇస్తూ.. వీటి అన్నిటిపై సరదాగా స్పందించాడు. అయితే, ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత, నందిని రెడ్డి , వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్ వీరందరి మధ్య మంచి బాండింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు వీరికి సంబంధించిన ఏవో ఒక పోస్ట్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటారు. కాబట్టి వారి మధ్యన ఉన్న చనువుతో ఇలాంటి మెసేజ్ లు చేయడం అనేది సహజం. రాహుల్ కూడా ఫన్నీగానే ఈ స్క్రీన్ షాట్ ను నెట్టింట పోస్ట్ చేశాడు. కానీ, ఇది చూసిన నెటిజన్లు మాత్రం ద్వంద్వార్ధలు తీస్తూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, రాహుల్ రవీంద్రన్, చిన్మయి.. ఇద్దరు కూడా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. తరచూ వారి వీడియోస్, ఫొటోస్ ను పోస్ట్ చేస్తూనే ఉంటారు. అటు వారి కెరీర్ విషయంలోనూ ఎవరికి వారు ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకుంటున్నారు. ఏదేమైనా, సెలెబ్రిటీలు ఏ చిన్న పోస్ట్ చేసినా అది వైరల్ అవ్వడం సహజం. అందులోను వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయమైతే ఖచ్చితంగా .. సామజిక మాధ్యమాలలో అది చర్చనీయాంశంగా మారుతుంది. ఇక ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ పోస్ట్ కూడా నెట్టింట హల్చల్ చేస్తోంది. మరి, ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet