iDreamPost
android-app
ios-app

యూట్యూబ్ వ్లాగర్స్ లొల్లి..! తెలంగాణ యాసలో అన్వేష్ వెటకారం!

  • Published Mar 24, 2024 | 11:19 AM Updated Updated Mar 26, 2024 | 5:05 PM

Naa Anveshana Comments: ఇటీవల కొంతమంది యూట్యూబర్లు ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు.

Naa Anveshana Comments: ఇటీవల కొంతమంది యూట్యూబర్లు ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు.

  • Published Mar 24, 2024 | 11:19 AMUpdated Mar 26, 2024 | 5:05 PM
యూట్యూబ్ వ్లాగర్స్ లొల్లి..! తెలంగాణ యాసలో అన్వేష్ వెటకారం!

తెలుగు రాష్ట్రాల్లో ఈ మద్య యూట్యూబ్ వ్లాగర్స్ ఎక్కువే అవుతున్నారు. ఎన్నో రకాల వీడియోలు చేస్తూ ప్రజలకు ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నారు. కొన్ని వీడియోలు బాగా క్లీక్ కావడంతో సదరు యూట్యూబర్ ఫేమస్ అవుతున్నారు. తెలుగు యూట్యూబ్ చూసేవారికి నా అన్వేషణ, బయ్య సన్నీ యాదవ్ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. వీరిద్దరూ ఆడియన్స్ కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలు అందిస్తుంటారు. ఇటీవల తెలుగు యూట్యూబర్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అంటున్నారు. తాజాగా నా అన్వేషణ యూట్యూబ్ చానల్ అన్వేష్ మాటలు వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

తెలుగులో ‘నా అన్వేషణ’ యూట్యూబ్ చానల్ గురించి తెలియని వారు ఉండరు. ఈ చానల్ ని వైజాక్ కి చెందిన అన్వేష్ రన్ చేస్తున్నాడు. ప్రపంచ దేశాల్లో వివిధ ప్రాంతాలకు ట్రావెల్ చేస్తూ అద్భుతమైన ప్రదేశాలను చూపిస్తూ.. అక్కడి ఫుడ్ కల్చర్ గురించి వివరిస్తుంటాడు. నా అన్వేషణ చానల్ కి 2 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. నా అన్వేషణ యూట్యూబ్ చానల్ లో అన్వేష్ చాలా ఫన్నీగా మాట్లాడుతూ ఎంటర్ టైన్ చేస్తుంటాడు. కొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బుక్ అవుతుంటాడు. ప్రస్తుతం యూట్యూబ్‌లో నా అన్వేషణ ఛానల్ మంచి ట్రెండింగ్ లో నడుస్తుంది. లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నాడు.

ఇక బయ్యా సన్నీ యాదవ్. ఇతను నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తి. బైక్ రైడర్ గా కెరీర్ మొదలు పెట్టిన సన్నీ తర్వాత యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. తన బైక్ పైన ఎన్నో ప్రదేశాలకు వెళ్లి వ్లాగ్స్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. ఇతని చానల్ కి 4.18 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇటీవల సన్నీ తాను ఇండియా నుంచి అమెరికాకు బైక్ పై రైడ్ చేస్తూ వెళ్లానని వ్లాగ్స్ చేశాడు. తాజాగా దీనిపై నా అన్వేషణ వ్లాగర్ తెలంగాణ యాసలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాల వైరల్ అవుతున్నాయి.

నా అన్వేషణ వ్లాగర్ అన్వేష్ తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. బయ్య సన్నీ యాదవ్ అనే యూట్యూబ్ వ్లాగర్ బైక్ పై ఇండియా నుంచి అమెరికాకు వెళ్లలేదని.. షిప్పుల్లో బైప్ ను పంపి అతను విమానంలో వెళ్లాడంటూ వెటకారంగా మాట్లాడారు. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అన్వేష్, సన్నీ యాదవ్ మీకూ మీకూ ఏదైనా గొడవలు ఉంటే.. పర్సనల్ గా చూసుకోండి. లైవ్ లో కోట్లమంది ముందు ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం బాగాలేదని, అన్వేష్ నువు తెలంగాణ యాస, భాష ను కించపరుస్తే చూస్తూ ఊరుకునేది లేదు’అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అన్వేష్ చెప్పింది కరెక్టే బ్రో అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio