iDreamPost
android-app
ios-app

వీడియో: ఇలా ఉన్నారేంట్రా!.. వధువుకు గిఫ్ట్ ఇచ్చినట్లు ఇస్తూనే ..

  • Published May 19, 2024 | 6:12 PM Updated Updated May 19, 2024 | 6:14 PM

Man Attacking The Groom: ఈ మధ్య కాలంలో పెళ్లి మండపాల్లో జరుగుతున్న చిత్ర విచిత్రమైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవతున్నాయి.

Man Attacking The Groom: ఈ మధ్య కాలంలో పెళ్లి మండపాల్లో జరుగుతున్న చిత్ర విచిత్రమైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవతున్నాయి.

  • Published May 19, 2024 | 6:12 PMUpdated May 19, 2024 | 6:14 PM
వీడియో: ఇలా ఉన్నారేంట్రా!.. వధువుకు గిఫ్ట్ ఇచ్చినట్లు ఇస్తూనే ..

పెళ్లంటే నూరేళ్ల బంధం అంటారు. ఈ మధ్య పెళ్లిళ్లు చాలా వరకు ఇంటి ముందు కాకుండా ఫంక్షన్ హాల్స్, కన్వేన్షన్ హాల్స్ లో తమ స్థాయికి తగ్గట్టు ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. పెళ్లి అనేది ఒక్కసారి చేసుకుంటారు.. అది ప్రతి ఒక్కరూ తమ జీవితంలో గుర్తుంచుకునేలా జరుపుతున్నారు. ఈ మధ్య కాలంలో పెళ్లి మండపాల్లో జరిగే సంఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లికొడుకు, పెళ్లి కూతురు మధ్య జరిగే ఫన్నీ మూవ్ మెంట్స్, బారాత్ లో జరిగే హంగామా, డ్యాన్స్ లకు సంబంధించిన వీడియోలో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రిసెప్షన్ సందర్భంగా స్టేజ్ పై కూర్చున్న పెళ్లికూతురుకి గిఫ్ట్ ఇచ్చి అంతలోనే షాక్ ఇచ్చాడు ఓ యువకుడు.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కాలంలో వివాహ వేడుకల్లో సరదా సంఘటనలతో పాటు కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వివాహ కార్యక్రమంలో షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. స్నేహితురాలి పెళ్లికి హాజరైన యువకుడు.. నూతన వధువుకు గిఫ్ట్ ఇచ్చాడు. అప్పటి వరకు బాగానే ఉన్నా తర్వాత జరిగిన ఘటన చూసి పెళ్లి కూతురు ఒక్కసారే షాక్ కి గురైంది. సదరు యువకుడు పెళ్లి కూతురుకి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత పెళ్లి కొడుకుపై ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి అక్కడ బంధువులే కాదు.. పెళ్లికొడుకు షాక్ తిన్నాడు.

రాజస్థాన్ లోని చిత్తోర్ గఢ్ జిల్లాలో రష్మి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఉంచ గ్రామంలో ఇటీవల ఓ వివాహం జరిగింది. ఈ సందర్భంగా పెళ్లి కూతురు-పెళ్లి కొడుకు వేదికపై కూర్చిలో కూర్చున్నారు. బంధువుల అంతా గిఫ్ట్ ఇస్తూ వధూవరులను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఓ యువకుడు అక్కడికి వచ్చి పెళ్లి కూతురుకి గిఫ్ట్ ఇచ్చాడు. కొద్ది సేపటి తర్వాత పక్కకు వెళ్లి పెళ్లి కొడుపై పిడిగుద్దులు కురిపిస్తూ కత్తితో దాడి చేశాడు. బంధువులు గట్టిగా అరవడంతో అక్కడ నుంచి యువకుడు పారిపోయాడు. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో సదరు నిందితుడు వధువుతో పాటు ఒకే పాఠశాలలో టీచర్ గా పని చేశాడని.. రెండేళ్ల పాటు ఇద్దరూ ఒకే స్కూల్ లో టీచర్లు గా చేశారని ఆ సమయంలో తనంటే ఇష్టపడి ఉంటాడని.. వధువు వేరే యువకుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఇలాంటి దారుణానికి పాల్పపడినట్టు తెలిసింది. వరుడు తలపాగా పెట్టుకోవడం వల్ల కత్తిపోట్లు తగల్లేదని.. స్వల్పంగా గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు.

 

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş