iDreamPost
android-app
ios-app

Kumari Aunty: బుల్లితెరపై కుమారి ఆంటీ బిజీ.. రెమ్యూనరేషన్ అంత ఎక్కువా?

  • Published Mar 13, 2024 | 6:13 PM Updated Updated Mar 13, 2024 | 6:13 PM

నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా అంత కుమారి ఆంటీ చుట్టూనే తిరిగింది. రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే కుమారి ఆంటీ సోషల్ మీడియా పుణ్యమా అని.. బుల్లితెర వరకు వచ్చేసింది. మరి, బుల్లితెరపై ఒక్కో ఎపిసోడ్ చేయడానికి భారీగానే రెమ్యూనిరేషన్ తీసుకుంటుందట కుమారి ఆంటీ.

నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా అంత కుమారి ఆంటీ చుట్టూనే తిరిగింది. రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే కుమారి ఆంటీ సోషల్ మీడియా పుణ్యమా అని.. బుల్లితెర వరకు వచ్చేసింది. మరి, బుల్లితెరపై ఒక్కో ఎపిసోడ్ చేయడానికి భారీగానే రెమ్యూనిరేషన్ తీసుకుంటుందట కుమారి ఆంటీ.

  • Published Mar 13, 2024 | 6:13 PMUpdated Mar 13, 2024 | 6:13 PM
Kumari Aunty: బుల్లితెరపై కుమారి ఆంటీ బిజీ.. రెమ్యూనరేషన్ అంత ఎక్కువా?

కుమారి ఆంటీ..ఇప్పుడు ప్రత్యేకించి ఆమె గురించి ఎవరికీ పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా అంత కుమారి ఆంటీ చుట్టూనే తిరిగింది. కుమారి అంటూ ఎందుకు ఫేమస్ అయిందో.. ఎలా ఫేమస్ అయిందో కూడా అందరికి తెలిసిన విషయమే. ఒకే ఒక్క డైలాగ్, ఒకే ఒక్క వీడియోతో రోడ్ సైడ్ చిరు వ్యాపారం చేసుకుంటున్న కుమారి ఆంటీ ప్రయాణం బుల్లితెరవరకు చేరుకుంది. సోషల్ మీడియా పవర్ తో ఒక్కసారిగా కుమారి ఆంటీ రేంజ్ మారిపోయింది. సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన తర్వాత.. వరుస ఇంటర్వూస్ ఇచ్చేసింది. ఆ తర్వాత మెల్లగా బుల్లితెరలో జరుగుతున్న టీవీ షోస్ లో ప్రత్యేక్షమయ్యింది. కుమారి ఆంటీ క్రేజ్ బాగా పెరిగిపోయింది అని అందరు అనుకునే క్రమంలో .. టీవీ సీరియల్స్ లో కనిపించి సర్ప్రైజ్ చేసింది. మరి, ఇంతకీ వీటి అన్నిటికి కుమారి ఆంటీ తీసుకుంటున్న రెమ్యూనిరేషన్ గురించి తెలిస్తే.. నోటి మీద వేలువేసుకోవాల్సిందే.

ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసినట్టు.. “నాన్న మీది మొత్తం 1000 అయింది.. రెండు లివర్లు ఎక్స్ట్రా” ఈ ఒక్క డైలాగ్ కుమారి ఆంటీ జీవితాన్నే మార్చేసింది. యూట్యూబ్ లో హల్చల్ చేసిన తర్వాత ఇప్పుడు ఏకంగా బుల్లి తెర పెద్ద ఛానెల్స్ లోనే కుమారి ఆంటీ సందడి చేసేస్తోంది. ఓ సాధారణ మహిళ సెలబ్రిటీ అయిపొయింది. ఈటీవీలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’, మా టీవిలో ‘బిబి ఉత్సవ్’, జీ తెలుగులో ‘రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ సీరియల్.. ఇలా కుమారి ఆంటీ చేతి నిండా ఈవెంట్స్ ,షెడ్యూల్స్ తో బిజీ అయిపొయింది. మరి, బుల్లితెరపై ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి .. బిజినెస్ క్లోజ్ చేసుకుంటుందా అంటే.. అదేం లేదంటుంది కుమారి ఆంటీ. నా ఉపాధి ఫుడ్ బిజినెస్ ఏ కాబట్టి ఇందులోనే కంటిన్యూ అవుతూ.. ఖాళీ టైమ్ లో షోస్ చేస్తానంటూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Kumari aunty remuneration in TV shows

“నేను టీవీ షోలు చేయడం చాలా హ్యాపీగా ఉంది. సీఎం గారు స్పదించడానికి ముందే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం చేశాను. బిబి ఉత్సవ్ కి మాత్రం సీఎం గారి స్పందన తర్వాత కాల్ వచ్చింది. ఏదేమైనా నా ఉపాధి ఫుడ్ బిజినెస్ ఏ కాబట్టి.. దీని తర్వాతే ఏదైనా .. నాకు ఖాళీగా ఉన్నపుడు మాత్రమే షోస్ కి వెళ్తున్నా.. అలాగే నాతో పాటు నేను చేసిన ఫుడ్ ను కూడా సెట్ లోకి తీసుకుని వెళ్తున్న. వాళ్లంతా ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.” అంటూ కుమారి ఆంటీ చెప్పుకొచ్చింది. అయితే, తన ఫుడ్ స్టాల్ దగ్గర మాత్రం కుమారి ఆంటీ అంతగా కనిపించట్లేదట. ఆమె భర్త, కుమారుడు ఆ బిజినెస్ చేసుకుంటున్నారట. ఇక కుమారి ఆంటీ రెమ్యూనిరేషన్ విషయానికొస్తే.. ఇప్పుడిప్పుడే బుల్లితెరమీద కూడా సెలెబ్రిటీ అవుతుంది కాబట్టి.. ప్రస్తుతం కుమారి ఆంటీ సైడ్ నుంచి డిమాండ్ అయితే ఏమి లేదు కానీ, ఒక షోకి వెళ్ళొస్తే.. యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు రెమ్యూనిరేషన్ ఇస్తున్నారట. మొత్తానికి కుమారి ఆంటీ రేంజ్ ,క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş