iDreamPost
android-app
ios-app

పెళ్ళికి సిద్దమైన “నా అన్వేషణ” యూట్యూబర్! మెలిసాని పట్టేశాడు!

  • Published Aug 30, 2023 | 12:22 PM Updated Updated Aug 30, 2023 | 12:27 PM
  • Published Aug 30, 2023 | 12:22 PMUpdated Aug 30, 2023 | 12:27 PM
పెళ్ళికి సిద్దమైన “నా అన్వేషణ” యూట్యూబర్! మెలిసాని పట్టేశాడు!

ఒకప్పుడు సెలబ్రెటీలు అంటే సినిమా స్టార్స్ మాత్రమే. ఆ తరువాత బుల్లితెర ప్రభంజనం మొదలైంది. ఇప్పుడు మాత్రం డిజిటల్ హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది యూట్యూబర్స్ సెలబ్రెటీ స్టేటస్ దక్కించుకుంటున్నారు. ఇలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది “నా అన్వేషణ” యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గురించి. ఎక్కడో వైజాక్ నుండి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఇప్పటికే కొన్ని వందల దేశాలను చుట్టేసి.., ఇండియాలోనే నెంబర్ 1 యూట్యూబర్ గా అన్వేష్ పేరు దక్కించుకున్నాడు. కాగా.. ప్రస్తుతం ఆఫ్రికా టూర్ లో ఉన్న అన్వేష్.. తన పెళ్లిపై వీడియోస్ రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇస్తున్నాడు. లాస్ట్ వీడియోలో తన పెళ్లి ఎలా క్యాన్సిల్ అయ్యిందో చెప్పిన అన్వేష్.. తాజా వీడియోలో మాత్రం తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అందరికీ పరిచయం చేశాడు.

అన్వేష్.. “చైనా” సిరీస్ నుండి బాగా పాపులర్ అయినప్పటికీ, అంతకుముందు నుండే చాలా దేశాలను కవర్ చేస్తూ వస్తున్నాడు. ఈ సమయంలోనే “పెరు” దేశంలో ఉండగా అన్వేష్ కి మెలిసా పరిచయం అయ్యింది. అక్కడ ఓ హాస్టల్ లో కలుసుకున్న వీరు.. తరువాత “బ్రెజిల్” లో కలిసి చాలా వీడియోస్ చేశారు. మెలిసా కూడా స్వతహాగా యూట్యూబర్ కావడంతో.. అప్పట్లో వీరి వీడియోలు బాగానే వైరల్ అయ్యాయి. కానీ.., తరువాత వచ్చిన చిన్న గ్యాప్ కారణంగా.. అన్వేష్ కు మెలిసా దూరం అయ్యింది. అయితే.., తాజాగా మెలిసా అన్వేష్ ప్రేమను అంగీకరించి.. అతనితో కలిసి ట్రావెల్ చేయడానికి ఆఫ్రికాకి చేరుకుంది. తాజాగా అన్వేష్ ఈ వీడియోని యూట్యూబ్ లో పోస్ట్ చేసి.. తనకి పెళ్లి సమయం దగ్గర పడింది అంటూ తెగ సంబర పడిపోతూ చెప్పాడు.

4 నెలలు పాటు.. అన్వేష్ ఆఫ్రికా టూర్ కొనసాగబోతోంది. ఈ 4 నెలలు పాటు వీరిద్దరి ట్రావెలింగ్ సజావుగా సాగితే వెంటనే పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. “నన్ను వద్దు అనుకున్న అమ్మాయి.. మళ్ళీ ఇలా వెతుక్కుంటూ వస్తుందని అస్సలు అనుకోలేదు. నా సబ్ స్క్రైబర్స్ వల్లే ఇదంతా సాధ్యం అయ్యింది” అంటూ అన్వేష్ ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు. ఇక మెలిసా మాత్రం అందంలో దేవకన్యని తలపిస్తోంది. అన్వేష్ కి మెలిసానే సరైన జోడీ అని, ఆ అమ్మాయి కూడా ఇలా ట్రావెలింగ్ వీడియోస్ చేసే యూట్యూబర్ కావడంతో వీరి పెయిర్ సూపర్ ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. “నా అన్వేషణ” ఛానెల్ ద్వారా.. మన అందరికీ ప్రపంచదేశాల అందాలను చూపిస్తున్న అన్వేష్ కి కామెంట్స్ రూపంలో మీ బెస్ట్ విషెష్ అందించండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom