iDreamPost
android-app
ios-app

ఈ ఫొటోలో వేణుమాధవ్‌తో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా..?

  • Published Jan 02, 2024 | 6:45 PM Updated Updated Jan 02, 2024 | 6:45 PM

ఎంతో మంది తెర పైన ఎలాగైనా కనిపించాలని ఆశపడుతూ ఉంటారు. కానీ, కొన్ని చిత్రాల్లో మెరిసి మాయమయిపోతుంటారు. మరి కొంతమంది తమ వృత్తికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా .. చిత్రాల్లో మెరుస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి వారికి సంబంధించిన పాత వీడియోస్ నెట్టింట హల్చల్ చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఓ ప్రముఖ జర్నలిస్ట్ కు సంబంధించి ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఎంతో మంది తెర పైన ఎలాగైనా కనిపించాలని ఆశపడుతూ ఉంటారు. కానీ, కొన్ని చిత్రాల్లో మెరిసి మాయమయిపోతుంటారు. మరి కొంతమంది తమ వృత్తికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా .. చిత్రాల్లో మెరుస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి వారికి సంబంధించిన పాత వీడియోస్ నెట్టింట హల్చల్ చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఓ ప్రముఖ జర్నలిస్ట్ కు సంబంధించి ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

  • Published Jan 02, 2024 | 6:45 PMUpdated Jan 02, 2024 | 6:45 PM
ఈ ఫొటోలో వేణుమాధవ్‌తో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా..?

ప్రస్తుతం సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎదో సాధిద్దాం అని ఇండస్ట్రీ వైపు అడుగుపెట్టిన వారే. కానీ ఈ రంగంలో రాణించడం అంత సులువు కాదు. అలా చాలా మంది అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. సినిమాలో ఏ చిన్న క్యారక్టర్ ఇచ్చిన కూడా తమ ప్రతిభను కనబరుస్తారు. తర్వాత అవకాశాలు రాక కొన్ని చిత్రాల్లో కనిపించి కనుమరుగైపోయిన నటులు ఎంతో మంది ఉన్నారు. కానీ కొంతమంది ఊహించని వారు కూడా తెరపైన కనిపించి ఆశ్చర్యపరుస్తారు. వారికీ ఈ రంగంలో ఎటువంటి నైపుణ్యం లేకపోయినా.. సరే వచ్చిన అవకాశంలోనే అద్భుతంగా తమ ప్రతిభను కనబరుస్తారు. అలా, నిత్యం జనాల నోళ్ళలో నానే వ్యక్తి చిత్రాల్లో దర్శనమిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే మరి. అటువంటి వారికి సంబంధించి పాత వీడియోస్ ఎపుడైనా కనిపిస్తే.. వారిని గుర్తించడం కాస్త కష్టమౌతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ వీడియోలోని వ్యక్తి కూడా ఈ కోవకు చెందినవాడే.

తాజాగా,  ఓ హాస్య సన్నివేశంలో కమెడియన్ వేణు మాధవ్ తో కలిసి.. ఓ వ్యక్తి నటించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ సన్నివేశం శ్రీమతి బంగారం అనే చిత్రంలోనిది. రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. అయితే ఈ చిత్రంలో వేణుమాధవ్ తో కలిసి కొన్ని హాస్య సన్నివేశాలలో నటించిన.. వ్యక్తి మరెవరో కాదు, ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న. గుర్తుపట్టడానికి కాస్త ఆలస్యం అయినా ఆ సన్నివేశాలలో కనిపించేది మాత్రం ఈయనే. సాధారణంగా ఈ వ్యక్తి వార్తల్లో మాత్రమే చాలా ఫేమస్. అలాంటిది ఈ వ్యక్తికి సంబంధించిన వీడియో.. అది కూడా చిత్రంలో నటించింది.. ఇప్పుడు బయటపడే సరికి నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. సూటిగా అందరిని ప్రశ్నించే ఒక జర్నలిస్ట్ కు నటనలో కూడా నైపుణ్యం ఉంది అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, తీన్మార్ మల్లన్నకు వార్తల్లో మంచి పేరు ఉంది. రాజకీయంగా కూడా ఎలాంటి విషయాన్నైనా సులువుగా చెప్పే వ్యక్తి ఇతను. నిత్యం ఎదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు ఈ వ్యక్తి. దానితో పాటు ఈయన యూట్యూబ్ లో ప్రత్యేకంగా ఓ ఛానల్ ను ఏర్పాటు చేసుకుని.. అందులో రాజకీయ పరమైన విశేషాలను విశ్లేషిస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో కూడా మల్లన్నకు మంచి ఫాలోయింగ్ ఉంది. రాజకీయ పరంగా అయితే.. ఈ వ్యక్తికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

అయితే, ప్రస్తుతం మనం చూస్తున్న వీడియో గురించైతే.. అప్పట్లో కమెడియన్ వేణు మాధవ్ కు మల్లన్నకు మంచి స్నేహం ఉండేదట. ఆ క్రమంలో ఓ సారి మల్లన్న సినిమా షూటింగ్ చూడడానికి వెళ్ళాడట. ఆ సమయంలోనే తన మిత్రుడైన వేణు మాధవ్ కోరిక కాదనలేక తనతో ఓ సన్నివేశంలో నటించాడట మల్లన్న. అంతే కాకుండా త్రిష హీరోయిన్ గా నటించిన ఓ చిత్రంలోనూ తాను నటించానని మల్లన్న ఓ సందర్భంలో చెప్పాడు. ఇక ప్రస్తుతం తీన్మార్ మల్లన్నకు సంబంధించి.. వేణు మాధవ్ తో కలిసి నటించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom