iDreamPost
android-app
ios-app

క్రేజీ ఆఫర్: రెండు బీర్లు కొంటే ఒక బీరు ఫ్రీ! మహిళలకు ఫ్రీ లిక్కర్!

క్రేజీ ఆఫర్: రెండు బీర్లు కొంటే ఒక బీరు ఫ్రీ! మహిళలకు ఫ్రీ లిక్కర్!

ప్రాంతం ఏదైనా.. రాష్ట్రం ఏదైనా.. మద్యానికి- మందుబాబులకు కొదవ ఉండదు. ప్రపంచం మొత్తంలో కూడా ఇదే ఎక్కువ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టే బిజినెస్. నిజానికి వీల్లు ఎలాంటి ఆఫర్స్ లేకుండా చాలా డిమాండుగా వ్యాపారం చేస్తారు. కానీ, ఇప్పుడు వీళ్లే క్రేజీ ఆఫర్స్ ఇస్తున్నారు. రెండు బీర్లు కొంటే ఒకటి ఫ్రీ అని.. మహిళలకైతే ఫ్రీగా లిక్కర్ ఇస్తామంటూ అదిరిపోయే ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఈ ఆఫర్లు ఎక్కడ? ఎందుకు అలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు? అనే విషయాలు తెలుసుకుందాం.

ఈ ఆఫర్ తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటే మీరు బీర్లో కాలేసినట్లే. ఈ ఆఫర్ పుదుచ్చేరిలో అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా కూడా పుదుచ్చేరి మద్యానికి ఎంతో డిమాండ్ ఉంది. చాలా మంది వీకెండ్స్ లో అక్కడికి వెళ్లి తాగేసి వస్తారంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఒక్క పుదుచ్చేరిలోనే 900 రకాల మద్యం, 35 రకాల బీర్లు లభిస్తాయంటే అక్కడ మద్యానికి ఏ రేంజ్ డిమాండ్ ఉంటుంది, ఏ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందో అర్థమైపోతుంది. అయితే పుదుచ్చేరిలో మద్యం దుకాణాల మధ్య బీభత్సమైన పోటీ ఉంటుంది. రెస్టారెంట్లలోనే బార్లు కూడా నడుపుతున్నారు.

హోటల్ గదికే మద్యం సరఫరా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆ పోటీ మరింత పెరిగింది. అందుకే వాళ్లు ఇప్పుడు చీరల కొట్లు మాదిరిగా వీళ్లు కూడా బై 2 గెట్ 1 ఆఫర్ ప్రకటిస్తున్నారు. మద్యం దుకాణాల యజమానులు విపరీతంగా ప్రచారాలు చేస్తున్నారు. ఇంకొందరైతే మహిళల కోసం ప్రత్యేకంగా బార్లు నడుపుతున్నారంట. అందులో సర్వ్ చేసేవాళ్లు కూడా మహిళలే అవ్వడం విశేషం. అంతేకాకుండా కొందరైతే మహిళలను ఆకర్షించేందుకు ఫ్రీ మద్యం అని కూడా ఆఫర్ చేస్తున్నారంట. మరోవైపు పోలీసులు మద్యం మీద ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. అయినా లెక్క చేయకుండా మద్యం వ్యాపారులు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş