iDreamPost
android-app
ios-app

Filmymoji సాయి కిరణ్ నిశ్చితార్థం.. వీడియో రిలీజ్ చేసిన టీమ్..

  • Published Mar 12, 2024 | 8:53 PM Updated Updated Mar 12, 2024 | 8:53 PM

Filmymoji Sai Kiran: ప్రముఖ యూట్యూబర్, మిడిల్ క్లాస్ మధు అలియాస్ సాయి కిరణ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతని నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

Filmymoji Sai Kiran: ప్రముఖ యూట్యూబర్, మిడిల్ క్లాస్ మధు అలియాస్ సాయి కిరణ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతని నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

  • Published Mar 12, 2024 | 8:53 PMUpdated Mar 12, 2024 | 8:53 PM
Filmymoji సాయి కిరణ్ నిశ్చితార్థం.. వీడియో రిలీజ్ చేసిన టీమ్..

సాయికిరణ్ అండలూరి.. ఈ పేరు చెప్తే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు. కానీ, మిడిల్ క్లాస్ మధు అంటే మాత్రం అందరికీ ఇట్టే స్ట్రైక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ల ఛానల్ అన్నా, వారి కంటెంట్ అన్నా, వారి ఎపిసోడ్స్ అన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో అంత క్రేజ్ ఉంది మరి. వీళ్లు చేసే మిడిల్ క్లాస్ మధు సిరీస్ విశేష ఆదరణ ఉంది. ఈ మిడిల్ క్లాస్ మధు ఇంత హిట్టు కావడానికి డైరెక్టర్ సాయి కిరణ్ కూడా కారణం. పైగా మధు క్యారెక్టర్ చేసేది కూడా అతనే. ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ మధు అలియాస్ సాయి కిరణ్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నాడు.

యూట్యూబ్ ఫాలో అయ్యే వారిలో చాలామందికి ఫిల్మీమోజీ ఛానల్ గురించి తెలిసే ఉంటుంది. 2018లో స్టార్ట్ అయిన ఈ ఛానల్ కు పెద్దగా ఆదరణ లభించలేదు. ఆ తర్వాత 2020లో ఈ ఛానల్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఛానల్ బాగా వైరల్ అయ్యింది. తర్వాత వీళ్లకి వన్ మిలియన్ సబ్ స్క్రైబర్స్ కూడా దక్కారు. వన్ మిలియన్ దక్కించుకున్న తర్వాత కేవలం రెండేళ్లలోనే 5 మిలియన్ సబ్ స్క్రైబర్స్ కి దగ్గర్లో ఉన్నారు. ఈ ఛానల్ లో వచ్చిన కాన్సెప్ట్ తో తర్వాత చాలా మందే ఛానల్స్ క్రియేట్ చేశారు. కానీ, వీళ్ల తరహా కంటెంట్ ని మాత్రం అందుకోలేకపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sai Kiran Andaluri (@saikiranandaluri)

ఫిల్మీమోజీ ఛానల్ కు, ఆ మధు క్యారెక్టర్ కు అంత ఆదరణ లభించింది అంటే డైరెక్టర్ సాయి కిరణ్ వల్లే అంటారు. ఇప్పుడు ఆ మిడిల్ క్లాస్ మధు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నిజానికి వీళ్ల ఎంగేజ్మెంట్ 15 వారాల క్రితమే జరిగినా.. ఆ విషయాన్ని ఇప్పుడు ఒక ఎపిసోడ్ రూపంలో రిలీజ్ చేశారు. రచ్చబండ అని దానికి పేరు పెట్టి తమ సబ్ స్క్రైవబర్స్ కోసం రిలీజ్ చేశారు. ఇంతకాలం వారిని ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అయ్యేవాళ్లకి మాత్రమే తెలుసు. కానీ, ఈ వీడియోతో వారి ఫాలోవర్స్ అందరికీ తెలిసిపోయింది. వీళ్ల కంటెంట్ క్రియేటివిటీతో దానిని కూడా ఒక ఎపిసోడ్లా మార్చడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే సాయి కిరణ్ మార్క్ డైరెక్షన్ కూడా ఫ్యాన్స్ ని అలరిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Wedding Stories by Daniel (@wedding_stories_by_daniel)

సాయి కిరణ్ చేసుకోబోయే అమ్మాయి మరెవరో కాదు.. వారితో కలిసి పనిచేసే అమ్మాయేనట. ఫిల్మీమోజీ వీడియోస్ ఎడిట్ చేసే ఐశ్వర్యనే సాయికిరణ్ వివాహం చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం సాయి కిరణ్- ఐశ్వర్యల నిశ్చితార్థానికి సంబంధించి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. వాళ్లిద్దరికీ కామెంట్స్ రూపంలో వారి శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. అలాగే వారి ఐడియాని కూడా మెచ్చేసుకుంటున్నారు. అంతేకాకుండా చాలామంది సిరీస్ లో ఉండే కోమలికి తెలుసా మరి అని ప్రశ్నిస్తున్నారు. అయితే సిరీస్ లో కోమలి పాత్ర చేసేది కూడా ఐశ్వర్యనే. కాబట్టి రీల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో ఒకే క్రష్ అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. మరి.. మిడిల్ క్లాస్ మధు- ఐశ్వర్య జంటకు మీ విషెస్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetHoliganbetHoliganbetHoliganbetHoliganbetcasibomjojobetdeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetgrandpashabetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet giriş