iDreamPost
android-app
ios-app

Prashanth Varma: ప్రశాంత్ ఆఫీస్ కి ‘హనుమాన్’ వైరల్ అవుతున్న ట్వీట్

  • Published Jan 13, 2024 | 5:37 PM Updated Updated Jan 13, 2024 | 5:37 PM

తాజాగా హనుమాన్ చిత్రం థియేటర్లలో చేస్తున్న సందడి చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో ఏకంగా తన ఆఫీస్ కు హనుమంతుడు వచ్చాడంటూ.. దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్.. నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా హనుమాన్ చిత్రం థియేటర్లలో చేస్తున్న సందడి చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో ఏకంగా తన ఆఫీస్ కు హనుమంతుడు వచ్చాడంటూ.. దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్.. నెట్టింట వైరల్ అవుతోంది.

  • Published Jan 13, 2024 | 5:37 PMUpdated Jan 13, 2024 | 5:37 PM
Prashanth Varma: ప్రశాంత్ ఆఫీస్ కి ‘హనుమాన్’ వైరల్ అవుతున్న ట్వీట్

ప్రస్తుతం అంతటా వినిపిస్తున్న పేరు ప్రశాంత్ వర్మ. ఈ దర్శకుడు తీసిన చిత్రాలు వేళ్ళపై లెక్కపెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ దర్శకుడి గురించి కొన్ని వేల మంది మాట్లాడుకుంటున్నారు. తాజాగా విడుదలైన “హనుమాన్” చిత్రంతో తన బలాన్ని నిరూపించుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఒక యంగ్ హీరోతో ఈ యంగ్ డైరెక్టర్ తీసిన చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాల మధ్యన విడుదలైనా కూడా ‘హనుమాన్’.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా హనుమాన్ నామ స్మరణే జరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రశాంత్ వర్మ పలు ఇంటర్వ్యూలలో మాట్లాడారు. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ చేసిన ఓ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

యవ హీరో తేజ సజ్జ నటించిన ‘హనుమాన్’ జనవరి 12న థియేటర్ లలో విడుదలై.. ఇప్పటివరకు ఎంతో మంది అభిమానాన్ని తన సొంతం చేసుకుంది. తక్కువ బడ్జెట్ తో రూపొందించినా సరే.. ఈ దర్శకుడు హనుమాన్ ను తీసిన విధానానికి ప్రతి ఒక్కరు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ యువ దర్శకుడు చేస్తున్న ప్రయోగాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. హనుమంతుని భక్తి సారాన్ని కూడా ఈ కథలో చాలా అద్భుతంగా చిత్రీకరించడంతో.. థియేటర్ లన్ని దేవాలయాలుగా మారిపోయాయని చెప్పి తీరాలి. ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ‘హనుమాన్’ ఓ హిట్ చిత్రంగా ఖచ్చితంగా నిలిచిపోతుంది. అసలు ఆ హనుమంతుడి శక్తులు.. ఓ సాధారణ వ్యక్తిగా ఎలా వచ్చాయో చూపించడమే ఈ కథ. దీనిని అద్భుతంగా తెరకెక్కించి.. కథకు న్యాయం చేశాడు ప్రశాంత్ వర్మ.

ఇక ఈ చిత్రాన్ని మొదలుపెట్టిన దగ్గర నుండి.. అంతా ఆ హనుమంతులవారి దయతోనే సాగిందని, ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పారు మేకర్స్. ఈ క్రమంలో హనుమాన్ మూవీ విడుదలైన సందర్బంగా.. ప్రశాంత్ వర్మ ఆఫీస్ కు నిజంగానే హనుమంతుడు వచ్చాడంటూ.. కొన్ని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీనికి తోడు ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ తో ఇది ఇంకాస్త వైరల్ అవుతోంది. మరి నిజంగానే ప్రశాంత్ వర్మ దగ్గరకు హనుమంతుడు వచ్చాడా! . అతను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ లో ఒక కోతి ఫోటోను పెట్టి.. ‘చూడండి నా ఆఫీస్ కు ఎవరొచ్చారో!’ అంటూ పోస్ట్ చేశాడూ. తన ఆఫీస్ కు సాక్షాత్తు ఆ హనుమంతుల వారే వచ్చినట్లుగా భావించి.. ఈ ట్వీట్ చేశాడు ప్రశాంత్ వర్మ. దీనితో ఈ పోస్ట్ సామజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, హనుమాన్ చిత్రం రెండవ రోజు.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు ప్రశాంత్ వర్మ దర్శకత్వ ప్రతిభకు .. హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు. ఏదేమైనా ఈ ఒక్క సినిమాతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు ఈ యువ దర్శకుడు. ఇప్పుడు అందరి నోటా హనుమాన్ పేరునే పలికేలా చేశాడు ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు , ఈ దర్శకుడు తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş