iDreamPost
android-app
ios-app

ఆస్పత్రిలో స్పృహ లేకుండా ఉంటే ఎక్కడెక్కడో టచ్‌ చేశారు.. ఆ రోజు రాత్రి ఎంతో భయంకరం: కీర్తి భట్‌

  • Published Apr 27, 2024 | 12:30 PM Updated Updated Apr 27, 2024 | 4:59 PM

Keerthi Bhat: బిగ్ బాస్ ఫేమ్, సీరియల్స్ నటి కీర్తి భట్ గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కీర్తి భట్ అక్కడ తనకు జరిగిన దారుణమైన అనుభవాల్ని బయటపెట్టింది. ఇంతకి ఏం జరిగిందంటే..

Keerthi Bhat: బిగ్ బాస్ ఫేమ్, సీరియల్స్ నటి కీర్తి భట్ గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కీర్తి భట్ అక్కడ తనకు జరిగిన దారుణమైన అనుభవాల్ని బయటపెట్టింది. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Apr 27, 2024 | 12:30 PMUpdated Apr 27, 2024 | 4:59 PM
ఆస్పత్రిలో స్పృహ లేకుండా ఉంటే ఎక్కడెక్కడో టచ్‌ చేశారు.. ఆ రోజు రాత్రి ఎంతో భయంకరం: కీర్తి భట్‌

బిగ్ బాస్ ఫేమ్, సీరియల్స్ నటి ‘కీర్తి భట్’ గురించి అందరికీ తెలిసిందే. ఈమె తెలుగు బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొని తన ఆటతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఈమె ప్రముఖ బుల్లితెర ఛానెల్ లోని పలు సీరియల్స్ లో హీరోయిన్ గా కూడా నటించింది. ఇక కీర్తి భట్ కు ఇటీవలే తన ప్రియుడితో ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లి పీటలెక్కనుంది. ఈ క్రమంలోనే తాజాగా జంటగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన కీర్తి భట్ అక్కడ తనకు జరిగిన దారుణమైన అనుభవాల్ని బయటపెట్టింది. ఇంతకి ఏం జరిగిందంటే..

సీరియల్ నటి కీర్తి భట్ గురించి అందరికీ తెలిసిందే. పేరుకు కన్నడ అమ్మాయి అయిన కీర్తి భట్..  2019లో ‘మనసిచ్చి చూడు’ అనే సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సీరియలోని ఆమె నటనతో  బుల్లితెర అడియాన్స్ కు దగ్గరైంది కీర్తి భట్. ఇక ఆ తర్వాత . ‘కార్తీకదీపం’లోనూ నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే 2022లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని తనదైన ఆటతో  అందర్నీ ఆకట్టకుంది. ఇక ప్రస్తుతానికి కీర్తి.. ‘మధురానగరిలో’ సీరియల్ చేస్తోంది.  అయితే ఒక ఒక నటిగా మంచి పాపులారిటి సంపాదించుకున్న కీర్తి జీవితంలో ఎన్నో కష్టాలను చవి చూసింది. కాగా, 2017లో కీర్తి భట్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవ్వడంతో.. ఈమె తల్లిదండ్రులు, అన్న,వదినలు వారి పిల్లలతో సహా అందరూ మృత్యువాతపడ్డారు.  ఇక అదృష్టం బాగుండీ కీర్తి ప్రాణాలతో బయటపడింది కానీ, కొన్నాళ్ల పాటు కోమాలోనే ఉంది. అయితే అప్పటిలో దారుణమైన సంఘటనలు  కీర్తి చెప్పుకొచ్చింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో జంటగా పాల్గొన్న కీర్తి భట్ తనకు ఎదురైన దారుణమైన అనుభవాల్ని బయటపెట్టింది. కాగా, ఆ ఇంటర్వ్యూలో కీర్తి భట్ మాట్లాడుతూ.. నా ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయిన తర్వాత నన్ను మంగళూరు తీసుకెళ్లారు. ఇక అక్కడే 35 రోజులు పాటు నేను ఉండాల్సి వచ్చింది. కానీ, అక్కడ నాకు చాలా చేదు అనుభవాలు ఎదరయ్యయి. నన్ను కొందరు ఎక్కడెక్కడో టచ్ చేసేవారు. ఇక ఆ విషయం నాకు తెలుస‍్తుంది కానీ, స్పర్మ లేకపోవడం వల్ల నెట్టేయడానికి కూడా బలముండేది కాదు. ఇకపోతే కోలుకున్న తర్వాత అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను. అయితే ఎక్కడికైనా వెళ్లాలంటే.. డబ్బు కావాలి.  ఆటో వాళ్ల దగ్గరికి వెళ్తే.. ‘200 ఇస్తా వస్తావా’ అంటే సరే వస్తానని అనేదాన్ని. కానీ, తర్వాత వాళ్ల లుక్ చూసి అర్థమయ్యేది అని కీర్తి భట్ తనకు ఎదురైన దారుణాల్ని చెప్పుకొచ్చింది. మరి, కీర్తి భట్ ఎదుర్కొన్న దారుణమైన సంఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap