iDreamPost
android-app
ios-app

తాళి కట్టు శుభవేళ .. స్పోర్ట్స్ బైక్‌పై నవ వధువు.. కారణం?

  • Published Feb 05, 2024 | 4:39 PM Updated Updated Feb 05, 2024 | 4:39 PM

పెళ్లి మండపానికి పల్లకీలోనో , పూల బుట్టలోనో , కార్ లోనో వధువు ఎంట్రీ ఇవ్వడం కామన్ , కానీ దైర్యంగా , హుందాగా స్పోర్ట్స్ బైక్ రైడ్ చేసుకుంటూ మండపానికి చేరుకోవడం వెరైటీ. ఆమె ఎవరో ఏంటో తెలుసుకుందాం.

పెళ్లి మండపానికి పల్లకీలోనో , పూల బుట్టలోనో , కార్ లోనో వధువు ఎంట్రీ ఇవ్వడం కామన్ , కానీ దైర్యంగా , హుందాగా స్పోర్ట్స్ బైక్ రైడ్ చేసుకుంటూ మండపానికి చేరుకోవడం వెరైటీ. ఆమె ఎవరో ఏంటో తెలుసుకుందాం.

  • Published Feb 05, 2024 | 4:39 PMUpdated Feb 05, 2024 | 4:39 PM
తాళి కట్టు శుభవేళ .. స్పోర్ట్స్ బైక్‌పై నవ వధువు.. కారణం?

మారుతున్న కాలంతో పాటు.. తరతరాలుగా వస్తున్న కొన్ని వేడుకలలో కూడా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పెళ్లి వేడుకుల విషయాల్లో వస్తున్న మార్పులు అంతా ఇంతా కాదు. నిత్యం సోషల్ మీడియాలో పెళ్లి వేడుకులలో జరిగే కొన్ని కొన్ని ఆసక్తికర వీడియోలను చూస్తూనే ఉన్నాము. వధువు వరుడి కోసం డ్యాన్స్ వేయడం లేదా వరుడు మండపానికి వినూత్నంగా విచ్చేయడం ఇలా ఒకటి రెండు కాదు కొన్ని వందల వీడియోలను ఇప్పటికే చూస్తూ ఉన్నాము. ఇక ఈరోజుల్లో ఒకప్పటి పద్దతులు, బిడియాలు అవేం కనిపించవని నూటికి నూరు శాతం చెప్పొచ్చు. ఈ క్రమంలో తన పెళ్లి సమయంలో ఒక యువతి .. పెళ్లి మండపానికి అందరిలా కాకుండా కాస్త వెరైటీగా విచ్చేసింది. దీనితో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సాధారణంగా ఏ పెళ్లిలోనైనా వధువు మండపానికి రావాలంటే .. పల్లకీలోనో, పూల బుట్టలోనో .. లేదా అప్ డేటెడ్ జనరేషన్ కాబట్టి కార్ లోనో పెళ్లికూతురిని మండపానికి తీసుకుని వస్తారు. ఎక్కడైనా జరిగే పద్దతి ఇదే. దీనికి కొన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలు ఉంటాయి. కానీ, బెంగాల్ కు చెందిన యువతీ .. పెళ్లి దుస్తులు ధరించి .. మండపానికి చేరుకున్న దృశ్యాలు చూస్తే మాత్రం.. అందరు ఆశ్చర్యపోవాల్సిందే. ఆధునిక యుగంలో.. అత్యాధునికంగా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్రైడ్. అయితే, అందరు ఆశ్చర్యపోయేంతలా ఆమె ఏం చేసిందంటే.. బెంగాల్ కు చెందిన ఈ పెళ్లికూతురు వినూత్నంగా స్పోర్ట్స్ బైక్ పై మండపానికి ఎంట్రీ ఇచ్చింది. ఆమె పేరు కాజల్ దత్తా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఆమె బైక్ నడిపే విధానాన్ని చూస్తే .. కాజల్ ప్రొఫెషనల్ బైక్ రైడర్ అని తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బైక్ రైడింగ్ కు సంబందించిన వీడియోలు చాలా ఉన్నాయి.

అయితే, ఇటీవల ఓ స్టార్ సెలేబ్రిటికి అల్లుడు కూడా.. తన ప్రొఫెషన్ కు తగినట్టుగానే.. రన్నింగ్ చేస్తూ మండపానికి చేరుకున్నాడు. బహుశా ఈ యువతీ కూడా .. తన ప్రొఫెషన్ ను పెళ్ళిలో కనబరచాలి అని భావించేదేమో. పెళ్లి దుస్తుల్లో ఈ యువతి చేసిన బైక్ రైడింగ్ చూసిన జనాలు.. ఈమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఏ మాత్రం బెరుకు లేకుండా .. ఎంతో హుందాగా స్పోర్ట్స్ బైక్ ను నడిపింది ఆ యువతి. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kajal Dutta (@_rider_girl_kajal_)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş