Swetha
Barrelakka Wedding: సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా బర్రెలక్క అలియాస్ శిరీష కు సంబంధించిన పెళ్లి వీడియోస్ ఏ కనిపిస్తున్నాయి. అయితే, మరి ఆమె వివాహ సమయంలో బర్రెలక్కకు కన్యాదానం చేసింది ఎవరో తెలుసా !
Barrelakka Wedding: సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా బర్రెలక్క అలియాస్ శిరీష కు సంబంధించిన పెళ్లి వీడియోస్ ఏ కనిపిస్తున్నాయి. అయితే, మరి ఆమె వివాహ సమయంలో బర్రెలక్కకు కన్యాదానం చేసింది ఎవరో తెలుసా !
Swetha
బర్రెలక్క అలియాస్ కన్నె శిరీష ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె పేరు మోత మోగిపోతుంది. తెలంగాణ ఎన్నికల ముందు వరకు ఆమె కేవలం ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్ మాత్రమే.. కానీ, తెలంగాణ ఎన్నికల తర్వాత ఈమె పేరు అంతటా వినిపించడం మొదలైంది. దీనితో ఒక్కసారిగా బర్రెలక్క ఫేమస్ అయిపొయింది. ఈ క్రమంలో ఆమె తాజాగా పెళ్లి పీటలెక్కింది. ఇక ఇప్పటికే పాపులర్ అయిన బర్రెలక్క .. పెళ్లి విషయం అనౌన్స్ చేయడంతో.. ఆమె నిశ్చితార్థం మొదలుకుని .. పెళ్లి కార్డు, ప్రీ వెడ్డింగ్ వీడియోస్, ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇక ఇప్పుడు వెడ్డింగ్ వీడియో కూడా నెట్టింట షికార్లు చేస్తోంది. అయితే, ఆ వీడియోలో బర్రెలక్కకు కన్యాదానం చేసింది ఎవరో తెలిస్తే మాత్రం అందరు ఆశ్చర్య పోవాల్సిందే.
కన్నె శిరీష అలియాస్ బర్రెలక్క .. తెలంగాణ పెద్దకొత్తపల్లి మండలం , మరికల్ గ్రామానికి చెందిన యువతి. ఇక ఇప్పుడు అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే కుర్రోడిని పెళ్లాడింది ఈ అమ్మడు. బర్రెలక్క తల్లి రోజు కూలీ, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వలన .. శిరీష తల్లీకి సాయంగా ఉంటూ ఉండేది. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో ఇన్ఫ్లుఎన్సర్ గా మారడం. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయడం. ఇక ఆ తర్వాత బాగా పాపులర్ అవ్వడం అందరికి తెలిసిన విషయమే. అయితే బర్రెలక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం ఆమె తండ్రి .. కుటుంబానికి దూరంగా ఉన్నాడని సమాచారం. బర్రెలక్కకు ఆమె తండ్రికి మధ్య మనస్పర్థలు ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ క్రమంలో ఆమెకు కన్యాదానం చేసింది ఎవరా అని అందరు ఆసక్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన పూర్తి వివరాలైతే బయటకు రాలేదు కానీ. కన్యాదానానికి సంబంధించిన ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఎట్టకేలకు బర్రెలక్క వివాహం.. కుటుంబ సభ్యులు, బందు మిత్రులు, సన్నిహితుల మధ్యన .. అంగరంగ వైభవంగా ముగిసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు పెళ్లి వీడియో కూడా నెట్టింట షికార్లు చేస్తుంది. దీనితో ఆమె అభిమానులు నవదంపతులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఆమె భర్త వెంకటేష్ కూడా బర్రెలక్క ఏ నిర్ణయం తీసుకున్నా.. తన వెంటే ఉంటూ సపోర్ట్ చేస్తూ వస్తున్నారట. కట్నం కూడా ఏం తీసుకోకుండా బర్రెలక్కను పెళ్లి చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బర్రెలక్క వివాహానికి సంబంధించిన ప్రతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.