iDreamPost
android-app
ios-app

Barrelakka: వీడియో: బర్రెలక్క ప్రీ వెడ్డింగ్ వీడియో.. అచ్చం సినిమా రేంజ్‌లో

  • Published Mar 25, 2024 | 2:41 PM Updated Updated Mar 25, 2024 | 2:41 PM

తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషనల్ గా మారిన బర్రెలక్క అలియాస్ శిరీష మరికొన్నిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ సందర్భంగా తన పెళ్లికి సంబంధించిన ఒక్కో వీడియోను రిలీజ్ చేస్తోంది. తాజాగా ప్రీ వెడ్డింగ్ షూట్ కు సంబంధించిన వీడియో విడుదల చేయగా.. వైరల్ అవుతోంది.

తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషనల్ గా మారిన బర్రెలక్క అలియాస్ శిరీష మరికొన్నిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ సందర్భంగా తన పెళ్లికి సంబంధించిన ఒక్కో వీడియోను రిలీజ్ చేస్తోంది. తాజాగా ప్రీ వెడ్డింగ్ షూట్ కు సంబంధించిన వీడియో విడుదల చేయగా.. వైరల్ అవుతోంది.

  • Published Mar 25, 2024 | 2:41 PMUpdated Mar 25, 2024 | 2:41 PM
Barrelakka: వీడియో: బర్రెలక్క ప్రీ వెడ్డింగ్ వీడియో.. అచ్చం సినిమా రేంజ్‌లో

ఒక్క డైలాగ్ బర్రెలక్క.. అలియాస్ శిరీషను ఓవర్ నైట్ స్టార్ చేసేశాయి. ఎంత చదివినా నోటిఫికేషన్లు లేవు ఫ్రెండ్స్.. అందుకే బర్రెలు కాస్తున్నా అంటూ చెప్పిన డైలాగ్ ఆమెను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా మార్చాయి. నిరుపేద కుటుంబంలో పుట్టిన శిరీష.. తెలంగాణ రాజకీయాల్లో ఓ ప్రభంజనం. గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఒక్క సారి వార్తల్లో నిలిచింది. ఆమె ధైర్యానికి, స్థైర్యానికి ఫిదా అయిపోయారు యువత. ఆమెకు అండగా నిలిచారు. కానీ ఆమె ఓడిపోయింది. ఓటమి విజయానికి తొలి మెట్టుగా భావించిన బర్రెలక్క.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని చెప్పింది. ఇంతలో పెళ్లి వార్తతో నెట్టింట్లో మరోసారి చక్కర్లు కొడుతోంది.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది బర్రెలక్క .. శిరీష వివాహం. తన పెళ్లి విషయాన్ని కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఉంది.  పెళ్లి చూపులు, పూలు పళ్లు (ఎంగేజ్ మెంట్), బ్యాచులర్ పార్టీ, మేకప్ వీడియోలు యూట్యూబ్, ఇన్ స్టా వేదికగా విడుదల చేసింది. అయితే ఎక్కడ వరుడు ఫోటో కానీ, పెళ్లి ఎప్పుడు రివీల్ చేయలేదు. అంతలో సోషల్ మీడియాలో ఆమె కార్డు వైరల్ కావడంతో.. తన వెడ్డింగ్ కార్డు రివీల్ చేసింది శిరీష. వెంకటేష్ అనే యువకుడితో ఆమె పెళ్లి నిశ్చయమైంది. అందులో మార్చి 28న ఆమె వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్ద కొత్త పల్లి గ్రామంలో పీఎంఆర్ గార్డెన్‌లో జరగనున్నట్లు వెల్లడైంది.

ఇప్పటి వరకు వరుడు ఎలా ఉంటాడో వెల్లడించలేదు బర్రెలక్క. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌కు సంబంధించిన వీడియో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ చేసింది. అందులో బావ ఎలా ఉన్నాడో తెలిసిపోయింది. అక్కకు కాబోయే వరుడు వెంకటేష్ ఫోటో రివీల్ అయిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. యూట్యూబ్‌లో సుమారు ఏడు గంటల క్రితం విడుదల చేసిన ఈ వీడియో మూడు లక్షల మందికి పైగా వీక్షించారు. అందులో ఓ శిరీష అంటూ స్పెషల్ సాంగ్స్ రూపొందించారు. హైదరాబాద్ చార్మినార్, మొజాంజాహి మార్కెట్, దేవాలయాలు, పొలాల గట్లు, ఇతర ప్రాంతాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు.

‘తను జగతికి అందని ఆమని అందమట.. చెలి పలికే పలుకులు మోహనరాగమట.. ఆమె నవ్వే గోదారి ఉరకలట.. నన్ను చూస్తే నా జన్మ ధన్యమట’ అంటూ సాగిపోయే పాటలో ఇద్దరూ మెస్మరైజ్ చేస్తున్నారు.  సినిమా రేంజ్ లో ఉంది ఈ వీడియో. ‘ఓ శిరిషా.. ఈ వెంకటేష్ జీవితాన్ని రాసిస్తున్నానే’ అంటూ ఆద్యంతం ఇంట్రస్టింగ్ లిరిక్స్‌తో సాగిపోతుంది సాంగ్స్. ఈ సాంగ్ అనిత.. అనిత అనే సాంగ్ పాడిన నాగరాజు పాడినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను చూస్తుంటే.. వావ్ అనకుండా ఉండలేరు. ఇందులో శిరీషక్క.. బావకు ముద్దు పెట్టిన సీను కూడా ఉందండోయ్. సిగ్గుల మొగ్గయిపోతుంది బర్రెలక్క. చాలా కలర్ ఫుల్ సాంగ్ షూట్ చేశారు. కాగా, ఈ వీడియోను చూసిన వారంతా.. కంగ్రాట్స్ చెబుతూ..  వెంకటేష్  ఆమెను బాగా చూసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet