iDreamPost
android-app
ios-app

హౌస్ లోకి అంబటి అర్జున్! వైల్డ్ కార్డ్ ఎంట్రీ వర్కౌట్ అవుతుందా?

  • Published Sep 14, 2023 | 5:53 PM Updated Updated Sep 14, 2023 | 5:53 PM
  • Published Sep 14, 2023 | 5:53 PMUpdated Sep 14, 2023 | 5:53 PM
హౌస్ లోకి అంబటి అర్జున్! వైల్డ్ కార్డ్ ఎంట్రీ వర్కౌట్ అవుతుందా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొత్తం ఉల్టా పుల్టా ఉంటుంది అంటున్న విషయం తెలిసిందే. అయితే మరీ అంత ఉల్టా పుల్టాగా ఈ సీజన్ సాగింది లేదు. అయితే ఇప్పటివరకు జరిగిన దాంట్లో అన్నీ సీజన్స్ తో పోలిస్తే.. కొన్ని మార్పులు అయితే చూపించారు. అయితే ఇంకా ప్రేక్షకులు ఆశిస్తున్న స్థాయి ట్విస్టులు అయితే చూపించింది లేదు. అందుకే బిగ్ బాస్ ఇంక వైల్డ్ కార్డ్ ఆట మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద అంబటి అర్జున్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. ఆ విషయాన్ని అర్జున్ కూడా చెప్పకనే చెప్పేశాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో మొత్తం 22 మంది వరకు కంటెస్టెంట్స్ ఉంటారు అని చెప్పారు. కానీ, హౌస్ లోకి కేవలం 14 మందినే పంపారు. పైగా వారిలో ఒకరు ఎలిమినేట్ కూడా అయ్యారు. ఇప్పుడు హౌస్ లో 13 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. వారి పరిధి మేరకు ఎంటర్ టైన్ చేసేందుకు బాగానే కష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు డోస్ మరింత పెంచేందుకు బిగ్ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ప్లాన్ చేస్తున్నరంట. అయితే హౌస్ లోకి వెళ్తారు అని చాలా మంది పేర్లు వినిపిస్తున్నా.. అంబటి అర్జున్ మాత్రం ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని బలంగా చెబుతున్నారు. పైగా అర్జున్ కూడా ఆ విషయాన్ని కన్ఫామ్ చేస్తున్నట్లు హింట్లు కూడా ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పిక్ స్టోరీగా పెడుతూ ‘కీప్ యువర్ నోటిఫికేషన్స్ ఆన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇప్పటికే అంబటి అర్జున్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నాడు అని లీక్స్ వస్తూనే ఉన్నాయి. అర్జున్ అలాంటి పోస్ట్ పెట్టడంతో అది కాస్తా కన్ఫామ్ చేసినట్లు అయింది.

ముందుగా అర్జున్ నే హౌస్ లోకి పంపడం వెనుక బిగ్ బాస్ పెద్ద స్కెచ్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం హౌస్ లో శివాజీ వర్సెస్ సీరియల్ బ్యాచ్ ఇష్యూ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అంబటి అర్జున్ లాంటి వ్యక్తిని హౌస్ లోకి పంపిస్తే ఆట మరింత రసవత్తరంగా మారుతుంది. ఎందుకంటే అర్జున్ ఎంతో యాక్టివ్ పర్సన్. డాన్స్, యాక్టింగ్, చమత్కారం అన్నీ సమపాళ్లలో చూపిస్తూ ఉంటాడు. అతను కూడా సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి.. అమర్ దీప్- శోభాశెట్టి- ప్రియాంకలతో కలిసిపోతే వాళ్ల బలం పెరిగినట్లే అవుతుంది. అలాగే శివాజీ గేమ్ స్ట్రాటజీ చూసి అతనికి మద్దతు తెలిపితే వీళ్ల పరిస్థితి మరింత ఇరకాటంలో పడినట్లు అవుతుంది. అంబటి అర్జున్ ఏ స్టాండ్ తీసుకున్నా కూడా.. ఆట మాత్రం కచ్చితంగా ఇంట్రస్టింగ్ గా మారుతుందని చెప్పచ్చు. అయితే అంబటి అర్జున్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వర్కౌట్ అవుతుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

ఎందుకంటే అర్జున్ ఇప్పటివరకు హౌస్ లో జరుగుతున్న గేమ్ మొత్తం చూస్తూ ఉంటాడు. ఎవరు ఎలా ఆడుతున్నారు? ఎవరి స్ట్రాటజీలు ఏంటి? ఎవరికి మంచి ఆదరణ ఉంది ఇలాంటి అన్నీ అర్జున్ బయటే ఉండి చూశాడు. కాబట్టి అర్జున్ కచ్చితంగా మాస్క్ వేసుకుని ఆడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఇప్పుడు అర్జున్ హౌస్ లోకి వస్తే.. మొదటి నుంచి ఉన్న కంటెస్టెంట్స్ కూడా తమకంటే అర్జున్ కే ఎక్కువ అడ్వాంటేజ్ ఉందనే నిర్ణయానికి వచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల వారి గేమ్ కూడా డిస్టర్బ్ కావచ్చు. కానీ, అర్చున్ మాత్రం వైల్డ్ కార్ట్ రూపంలో ఎంట్రీ ఇస్తే.. బిగ్ బాస్ సీజన్ ఇంకో లెవల్ కు వెళ్తుందనే చెప్పాలి. అర్జున్ లాంటి యాక్టివ్ పర్సన్ హౌస్ లో ఉంటే ఆట నిజంగానే మరింత రసవత్తరంగా మారుతుంది. అయితే అది ఇప్పటికే ఉన్న కంటెస్టెంట్స్ కి కాస్త మైనస్ అవుతుందనే చెప్పాలి. మరి.. అంబటి అర్జున్ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom