iDreamPost
android-app
ios-app

AI మాయ.. సీనియర్ హీరో లుక్ అదిరిపోయింది

  • Published Jan 10, 2024 | 5:25 PM Updated Updated Jan 10, 2024 | 5:25 PM

ఇప్పుడు మనం చాలా ఆధునిక యుగంలో జీవితాలను గడుపుతున్నాం. ఉన్నవి లేనట్టుగా .. లేనివి ఉన్నట్టుగా ఇలా దేనినైనా తారు మారు చేసి.. తయారు చేసే టెక్నాలజీ అందరి అరచేతిలో ఉంది. అయితే ఈ కొత్త టెక్నాలజీతో ఆనాటి నటుడు .. సోగ్గాడు శోభన్ బాబు మళ్ళీ పుట్టాడంటే నమ్మగలమా!

ఇప్పుడు మనం చాలా ఆధునిక యుగంలో జీవితాలను గడుపుతున్నాం. ఉన్నవి లేనట్టుగా .. లేనివి ఉన్నట్టుగా ఇలా దేనినైనా తారు మారు చేసి.. తయారు చేసే టెక్నాలజీ అందరి అరచేతిలో ఉంది. అయితే ఈ కొత్త టెక్నాలజీతో ఆనాటి నటుడు .. సోగ్గాడు శోభన్ బాబు మళ్ళీ పుట్టాడంటే నమ్మగలమా!

  • Published Jan 10, 2024 | 5:25 PMUpdated Jan 10, 2024 | 5:25 PM
AI మాయ.. సీనియర్ హీరో లుక్ అదిరిపోయింది

ప్రస్తుతం టెక్నాలజీలో ముందు ఉంది ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్. దీనిని ఉపయోగించి ఎటువంటి పనులనైనా చాలా సునాయాసంగా చేసేస్తున్నారు ప్రజలు. ఈ ఏఐ జనరేటెడ్ ఫోటోల వలన ఇప్పటికే కొంతమంది సినీ తారలు ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. అయితే, అవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు మాత్రం ఈ ఏఐ టెక్నాలజీ వలన .. టాలీవుడ్ ప్రముఖ నటుడి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ విడియోను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్లిపోతున్నారు. కానీ, ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ప్రస్తుతం మన మధ్యన లేకపోయినా .. సినిమాల రూపంలో బ్రతికే ఉన్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు టాలీవుడ్ అందగాడు శోభన్ బాబు.

ఇప్పుడంటే తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తున్నారు వెళ్తున్నారు. వారిలో కొంతమంది మాత్రమే వారికంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు. కానీ, ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన హీరోలు వారి పేరు కొన్ని తరాల పాటు గుర్తుండిపోయేలా.. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికైనా అందగాడు అంటే గుర్తొచ్చే వ్యక్తి సోగ్గాడు శోభన్ బాబు మాత్రమే. 1959లో నటుడిగా తన కెరీర్ ను ప్రారంభించిన శోభన్ బాబు.. 1996వరకు దాదాపు 230కి పైగా చిత్రాలలో నటించారు. ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ కాలంలోనే ఎంతో మంది అమ్మాయిలకు కలల రాకుమారుడిగా నిలిచిపోయాడు. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో చూస్తే మాత్రం.. ఈ తరం అమ్మాయిలు కూడా సోగ్గాడితో ప్రేమలో పడేలా ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. ఓ అందగాడు బీచ్ ఒడ్డున అలా స్లో మోషన్ లో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఆ అందగాడు ఏఐ జనరేట్ చేసిన సోగ్గాడు శోభన్ బాబు. మహేష్ బాబు, శోభన్ బాబు కలగలిపిన పోలికలతో.. బాలీవుడ్ రేంజ్ కట్ అవుట్ తో.. ఈ ఏఐ జనరేటెడ్ అందగాడు వీడియో .. ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, శోభన్ బాబు తన జీవితం చివరి వరకు కూడా .. ఎలా జీవించాలి అనుకున్నాడో అలానే జీవించాడు. కొన్ని వందల సినిమాలలో హీరోగా చేసినా ఆ సోగ్గాడు అప్పట్లో ఎంతో మంది యువతుల హృదయాలను దోచుకున్నాడు. ఎక్కువగా ఫ్యామిలీ స్టోరీలకు సంబంధించిన చిత్రాలను చేయడానికి మక్కువ చూపించేవాడు శోభన్ బాబు. ఏదేమైనా.. ఏఐ పుణ్యమా అని ఆనాటి సోగ్గాడు మళ్ళీ పుట్టినట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా అందరిని కొన్ని సంవత్సరాల వెనుక్కు తీసుకుని వెళ్ళిపోయింది ఈ వీడియో. ఈ వీడియోను తాజాగా ఆర్జీవీ ట్వీట్ చేయగా.. సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఏఐ జనరేటెడ్ శోభన్ బాబు వీడియోలు, ఫోటోల సందడే కనిపిస్తోంది. మరి, ఈ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş