Rats In ICU:ఆస్పత్రి ICUలో ఎలుకల గుంపులు.. రోగులపై స్వేచ్ఛగా! ఎక్కడంటే?

సాధారణంగా రోగాలు తగ్గించుకోడానికి అందరూ ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆసుపత్రికి వెళ్తే మాత్రం.. ఉన్న రోగానికి పది రోగాలు తోడయ్యేలా ఉన్నాయి అక్కడి పరిస్థితులు.

సాధారణంగా రోగాలు తగ్గించుకోడానికి అందరూ ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆసుపత్రికి వెళ్తే మాత్రం.. ఉన్న రోగానికి పది రోగాలు తోడయ్యేలా ఉన్నాయి అక్కడి పరిస్థితులు.

ప్రతి రోజు ఒక ఆసుపత్రికి కొన్ని వందలమంది రోగులు వారి జబ్బులను నయం చేసుకోడానికి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆసుపత్రి ప్రాంగణాన్ని ఎంత వీలైతే అంత పరిశుభ్రంగా ఉంచడం అక్కడి సిబ్బంది బాధ్యత. అందులోను జనరల్ వార్డుల కంటే ఐసీయూ లలో మరింత కేర్ కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ, ఉత్తర ప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మాత్రం.. మన రోగం నయం అవ్వడం తరువాత సంగతి.. కొత్త రోగాలు రాకుండా ఉంటే చాలు అనుకుంటున్నారు అక్కడి స్థానికులు. దానికి కారణం లేకపోలేదు. అక్కడి ఆసుపత్రిలో రోగులు, వైద్యులతో పాటు లెక్కలేనన్ని ఎలుకలు కూడా ఉన్నాయి . దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట అందరిని భయపెడుతున్నాయి.

అది ఉత్తర ప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి. సాధారణంగానే ప్రభుత్వ ఆసుపత్రులలో పరిశుభ్రత అంతంత మాత్రం, పైగా ఇప్పుడు ఎలుకల స్వైర విహారం చూసిన రోగులు బెంబేలెత్తిపోతున్నారు. ఏకంగా ఐసీయూలోనే ఎలుకలు రోగుల మీద నుంచి పాకుతూ వెళ్తున్నాయి. ఆసుపత్రి రూమ్స్ లోను కొన్ని వందల ఎలుకలు అటు ఇటు పరుగులు పెడుతూ కనిపిస్తున్నాయి. వీడియోలోని దృశ్యాలను గమనిస్తే ఒళ్ళు గగ్గుర్పొడిచేలా కనిపిస్తున్నాయి. ఉన్న రోగాలను నయం చేసుకుందాం అని వెళ్లిన రోగులకు.. ఈ ఎలుకల వలన కొత్త ఇన్ఫెక్షన్స్ వచ్చే సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది.

ఇప్పటికే దేశంలో ఒక పక్క మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెల్సిందే. ఇటువంటి పరిస్థితుల్లో ఆసుపత్రిలో ఎలుకల బెడద ఉండడం.. అక్కడి స్థానికులను మరింత కలవర పెడుతోంది. రోగులకు మాత్రమే కాకుండా ఆ ఆసుపత్రిలో పని చేసే సిబ్బందికి కూడా వీటి వలన ప్రమాదం కలిగే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. పైగా అక్కడ ఉన్నది ఒకటి రెండు ఎలుకలు కాదు.. ఏకంగా వందల సంఖ్యలో గుంపులు గుంపులు గా తిరుగుతున్నాయి. అక్కడి అధికారులు ఈ విషయమై నిర్లక్ష్యంగా ఉండడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

ఆసుపత్రిలో ఎలుకల బెడద విషయమై అధికారులు చర్యలు తీసుకోవాలని.. స్థానికులు కోరుకుంటున్నారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని.. ఇటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని వేడుకుంటున్నారు. ఏదేమైనా, ప్రభుత్వ అధికారులు ముందుకు వచ్చి.. వీలైనంత త్వరగా దీనిపైన చర్యలు తీసుకుంటే మంచిది. లేదంటే రోగాలను తగ్గించుకోవాలని ఆసుపత్రికి వచ్చిన వారికీ.. ఈ ఎలుకలతో కొత్త రోగాలు నిజంగానే వచ్చేలా ఉన్నాయి. ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో ఎలుకలు చేస్తున్న స్వైర విహారం.. సామజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తుంది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments