Swetha
ఇప్పుడున్న కాలంలో పెళ్లి అనగానే ముందుగా గుర్తొచ్చేది.. ప్రీ వెడ్డింగ్ షూటింగ్. ఈ షూట్ అవ్వకుండా ఎవరు పెళ్లి వరకు వెళ్లడంలేదు. ఈ ట్రెండ్ ఎపుడు మొదలైందో తెలియదు కానీ.. దీనిని ఫాలో అవ్వడంలో మాత్రం ఒకరిని మించి ఒకరు.. వింత వింతగా షూట్స్ తీయించుకుంటున్నారు.
ఇప్పుడున్న కాలంలో పెళ్లి అనగానే ముందుగా గుర్తొచ్చేది.. ప్రీ వెడ్డింగ్ షూటింగ్. ఈ షూట్ అవ్వకుండా ఎవరు పెళ్లి వరకు వెళ్లడంలేదు. ఈ ట్రెండ్ ఎపుడు మొదలైందో తెలియదు కానీ.. దీనిని ఫాలో అవ్వడంలో మాత్రం ఒకరిని మించి ఒకరు.. వింత వింతగా షూట్స్ తీయించుకుంటున్నారు.
Swetha
ఒకప్పుడు పెళ్లంటే బంధుమిత్రులు స్నేహితుల సమక్షంలో సందడిగా జరిగేది. కాల క్రమేణ పెళ్లిని జీవితాంతం గుర్తుండిపోవాలని వీడియోలు, ఫోటోలు తీయించుకోవడం మొదలుపెట్టారు. ఆ తరువాత మెల్లగా ఒకరిని చూసి ఒకరు పెళ్ళిలో కొత్త కొత్త ఈవెంట్స్ యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే, అందులో ముఖ్యంగా అందరూ ఫాలో అయ్యేది మాత్రం ప్రీ వెడ్డింగ్ షూట్. ఒక్కో జంట ఒక్కో విధంగా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ను తీయించుకుంటున్నారు. ఎదో ఒక కొత్త ట్రెండ్ ను సెట్ చేయాలి అనే విధంగా ఎక్కడపడితే అక్కడ షూటింగ్స్ చేసుకుంటున్నారు. తాజగా.. ఓ జంట రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్ల పైన తీయించుకున్న ప్రీ వెడ్డింగ్ వీడియో.. ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.
సాధారణంగానే ప్రీ వెడ్డింగ్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు.. సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతూ ఉంటాయి. పైగా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీయడానికి ప్రత్యేకించి ఫోటో గ్రాఫర్లు కూడా ఉంటారు. వీటికి సంబంధించి కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. నూతన వధూ వరులు జీవితాంతం గుర్తుండిపోయేలా.. సినిమా పాటలను ఈ వీడియోలకు జత చేసి మురిసిపోతూ ఉంటారు. ఫోటో గ్రాఫర్లు కూడా వారి క్రియేటివిటీని చూపిస్తూ ఉంటారు. అయితే, ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటోలు ట్రెండ్ అవ్వడమే కాకుండా.. కొన్నిసార్లు సామాజిక మాధ్యమాలలో ట్రోల్ కూడా అవుతూ ఉంటాయి. వారు ఎంచుకున్న థీమ్ అండ్ కాస్ట్యూమ్స్ విషయాలలో ఇప్పటికే కొంతమంది సామజిక మాధ్యమాలలో ట్రోల్ అవ్వడం చూశాము. ఇక ఇప్పుడు తాజాగా ఓ జంట రద్దీగా ఉన్న రోడ్లపై ఆర్టీసీ బస్సులో ప్రీ వెడ్డింగ్ షూట్ ను తీయించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
అయితే, ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్ తీయించుకోవడం అనేది వారి వ్యక్తి గతం. కానీ, పబ్లిక్ ప్లేస్ లో షూటింగ్ జరుపుకోవడం వలన కొంతమంది ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పదింస్తున్నారు. ఆర్టీసీ బస్సులో షూటింగ్ చేసినందుకు కొంతమంది విమర్శించగా.. జంట చూడముచ్చటగా ఉంది, సాంగ్ బావుంది అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. దీనితో ఈ వీడియో సామజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Are Hyderabad roads now the backdrop for pre-wedding tales?
I’m all in for urban fairy tales, but let’s ensure our roads don’t steal the spotlight with unexpected plot twists. Seeking your department’s wisdom on this @tsrtcmdoffice@TSRTCHQ @HYDTP #Hyderabad#RoadSafety#Tsrtc pic.twitter.com/mfSTxktmNC— ⚠☄⚕Bad Drivers of Hyderabad ⛙⛴☣ (@trafficpunisher) January 7, 2024