iDreamPost
android-app
ios-app

Ranbir Kapoor:యానిమల్ హీరో రణ్ బీర్ పై కంప్లైంట్.. మనోభావాలు దెబ్బ తీశాడంటూ

  • Published Dec 28, 2023 | 12:23 PM Updated Updated Dec 28, 2023 | 12:23 PM

క్రిస్టమస్ సంబంధించి జరిగిన వేడుకులలో భాగంగా మతపరమైన మనోభావాలు దెబ్బ తీసినందుకు.. ప్రముఖ బాలీవుడ్ నటుడిపైన తాజాగా కేసు నమోదు చేశారు.

క్రిస్టమస్ సంబంధించి జరిగిన వేడుకులలో భాగంగా మతపరమైన మనోభావాలు దెబ్బ తీసినందుకు.. ప్రముఖ బాలీవుడ్ నటుడిపైన తాజాగా కేసు నమోదు చేశారు.

  • Published Dec 28, 2023 | 12:23 PMUpdated Dec 28, 2023 | 12:23 PM
Ranbir Kapoor:యానిమల్ హీరో రణ్ బీర్ పై కంప్లైంట్.. మనోభావాలు దెబ్బ తీశాడంటూ

ఇటీవల విడుదలైన ‘యానిమల్’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు బాలీవుడ్ యాక్టర్ ‘రణ్ బీర్ కపూర్’. ఈ చిత్రం తరువాత రణ్ బీర్ పై ఎక్కడ చూసిన ప్రశంసల వర్షమే కురుస్తోంది. మొదట ఈ చిత్రంపైన విమర్శలు కురిపించిన వారు సైతం.. రణ్ బీర్ నటనకు ఫిదా అయిపోయి ప్రశంసలతో ముంచెత్తారు. ఇలా, ‘యానిమల్’ చిత్రం విజయాన్ని ఆనందిస్తున్న రణ్ బీర్ కపూర్ పై తాజాగా ఓ పోలీసు కేసు నమోదు అయింది. దానికి కారణం ఇటీవల జరిగిన క్రిస్టమస్ వేడుకులకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో. ఆ వీడియోలో రణ్ బీర్ మతపరమైన సిద్ధాంతాలను ఉల్లంగించాడు అంటూ అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

నెట్టింట షేర్ అయిన వీడియోలోని దృశ్యాలను గమనిస్తే.. రణ్ బీర్ కుటుంబం అంతా కలిసి క్రిస్టమస్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటున్న సమయంలో.. ఈ హీరో కేక్ పైన మద్యాన్ని పోసి దానికి నిప్పు వెలిగిస్తూ “జై మాతా ది” అంటూ అరిచాడు. అయితే, హిందూ మతంలోని సంప్రదాయం ప్రకారం.. ఇతర దేవతల ముందు అగ్ని దేవుడిని ఆరాధిస్తారు. కానీ, కపూర్ కుటుంబం వేరే మతానికి సంబంధించిన వేడుకలు జరుపుకునే సమయంలో.. హిందూ మతానికి సంబంధించిన పేరును పలికింది. పైగా, మద్యాన్ని కేక్ పైన పోసి నిప్పు అంటించి మరి “జై మాతా ది” అని అరవడంతో.. ఇది హిందూ మతాన్ని అవమానించినట్లుగా భావించి సంజయ్ తివారి ఈ విషయంపై స్పదించారు.

ఈ విషయమై సంజయ్ తివారి మాట్లాడుతూ “కపూర్ కుటుంబం ఉద్దేశపూర్వకంగా వేరే మతపరమైన పండుగను జరుపుకునేటప్పుడు.. మత్తు పదార్దాలను కేక్ పై పోస్తూ.. అదే సమయంలో మరొక మతం యొక్క పేరును ఉచ్చరించారు” అంటూ పేర్కొన్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బ తీసినందుకు కపూర్ కుటుంబ సభ్యులపై .. ముంబైలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసు విషయమై ఇంకా  ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) నమోదు కాలేదు.

ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లోని ఫిల్మ్‌ఫేర్ అఫీషియల్ అకౌంట్ నుంచి.. పోస్ట్ అయింది. ఫిల్మ్‌ఫేర్ ప్రకారం, ఈ వీడియో కపూర్ కుటుంబం క్రిస్టమస్ సెలెబ్రేషన్స్ లో లంచ్ చేస్తున్నపుడు జరిగిన సన్నివేశం. ఏదేమైనా, అప్పుడప్పుడు ఇటువంటివి పొరపాటున జరుగుతూ ఉండడం సహజం. కానీ, ఇక్కడ బాలీవుడ్ టాప్ యాక్టర్ రణ్ బీర్ చేశాడు కాబట్టి.. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)