iDreamPost
android-app
ios-app

వీడియో: సుట్టంలా సూసిపోకలా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లిరికల్ సాంగ్!

  • Published Aug 16, 2023 | 7:09 PM Updated Updated Aug 16, 2023 | 7:09 PM
  • Published Aug 16, 2023 | 7:09 PMUpdated Aug 16, 2023 | 7:09 PM
వీడియో: సుట్టంలా సూసిపోకలా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లిరికల్ సాంగ్!

టాలీవుడ్ లో ఉన్న ఎంతోమంది యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ కు ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అతని ఎనర్జీ, యూత్ అట్రాక్ట్ చేసే మాటలు, అనుకున్నది బలంగా చెప్పే విధానం అందరికీ నచ్చుతుంది. ఇటీవలే దాస్ కా ధమ్కీ సినిమా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. కెరీర్ లో స్పీడు పెంచిన ఈ మాస్ హీరో తాజాగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో విశ్వక్ రగ్డ్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

విశ్వక్ సేన్ కు టాలీవుడ్ లో ఒక పేరు అయితే వచ్చింది. మినిమం గ్యారెంటీ హీరోగా విశ్వక్ కు గుర్తింపు లభించింది. ఈ యంగ్ హీరో కెరీర్లో 11వ చిత్రంగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా రాబోతోంది. ఇందులో డీజే టిల్లు భామ నేహాశెట్టితో జత కడుతున్నాడు. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా విశ్వక్ సేన్- నేహాశెట్టి కలిసి.. స్టేజ్ పై స్టెప్పులేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సాంగ్ లో ఉన్న సిగ్నేచర్ స్టెప్ ని హీరో- హీరోయిన్ లైవ్ పర్ఫామ్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో నిండిపోయారు. సాధారణంగానే విశ్వక్ సేన్ ప్రమోషన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటాయి.

ముఖ్యంగా తన స్పీచ్ తోనే అందరినీ తనవైపు తిప్పుకుంటాడు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి డాన్సులు కూడా చేసేస్తున్నాడు. ఇంక నేహాశెట్టి విషయానికి వస్తే.. డీజే టిల్లు సినిమాతో ఈ భామకు తెలుగులో మంచి ఫేమ్ వచ్చింది. కిరణ్ అబ్బవరంతో కూడా ఒక సినిమా చేస్తోంది. ఆ సినిమాకి సంబంధించి సమ్మోహనుడా అంటూ రిలీజ్ అయిన సాంగ్ నెట్టింట ఎంత వైరల్ అవుతోందో అందరికీ తెలుసు. ఆ సాంగ్ కి రీల్స్ చేయని సెలబ్రిటీలు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా నేహాశెట్టి క్యూట్, పల్లెటూరు అమ్మాయి లుక్స్ లో కుర్రకారుకు గిలిగింతలు పెట్టేస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై వీళ్లు అంచనాలను భారీగా పెంచేస్తున్నారనే చెప్పాలి. మరి.. ఆ లిరికల్ సాంగ్ మీరూ చూసేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetpark girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom