iDreamPost
android-app
ios-app

తమిళ జర్నలిస్ట్ కి విజయ్ పేలిపోయే పంచ్! దెబ్బకు కళ్లు తేలేశాడు..

  • Author Soma Sekhar Published - 12:09 PM, Thu - 24 August 23
  • Author Soma Sekhar Published - 12:09 PM, Thu - 24 August 23
తమిళ జర్నలిస్ట్ కి విజయ్ పేలిపోయే పంచ్! దెబ్బకు కళ్లు తేలేశాడు..

విజయ్ దేవరకొండ.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఇండస్ట్రీ మెుత్తాన్ని షేక్ చేశాడు. ఇక గీతా గోవిందం మూవీతో మరోసారి తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు రుచిచూపాడు. ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ లో టాప్ హీరో రేంజ్ కు రౌడీ హీరో దూసుకొచ్చాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆడలేదు. అదీకాక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన లైగర్ అట్టర్ ఫ్లాప్ కావడంతో.. విజయ్ తీవ్ర నిరాశకు గురైయ్యాడు. ఇక ప్రస్తుతం డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖుషి’ మూవీపైనే భారీగా ఆశలు పెట్టుకున్నాడు విజయ్. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 1న విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్లను ప్రారంభించింది చిత్ర యూనిట్. అందులో భాగంగానే జరిగిన ప్రెస్ మీట్ లో కోలీవుడ్ జర్నలిస్ట్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.

‘ఖుషీ’ మూవీ రిలీజ్ కు సిద్దంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్లను ప్రారంభించింది చిత్ర యూనిట్. అందులో భాగంగానే కోలీవుడ్ లో ఓ ప్రెస్ మీట్ కు హాజరైయ్యాడు విజయ్ దేవరకొండ. ఈ కార్యక్రమంలో కోలీవుడ్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కళ్లు బైర్లు కమ్మే సమాధానం ఇచ్చాడు రౌడీ హీరో. ఓ జర్నలిస్ట్ ప్రశ్నిస్తూ..”నీకు తమిళ డైరెక్టర్లు వెట్రిమారన్, లోకేష్ కనగరాజన్ తప్ప మిగిలిన వాళ్ల గురించి అంతగా తెలీదు కదా?” అంటూ అడిగాడు. ఈ ప్రశ్నకు విజయ్ పేలిపోయే పంచ్ ఇచ్చాడు ఆ విలేఖరికి. ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ..

“నాకు కోలీవుడ్ డైరెక్టర్ అరుణ్ ప్రభు చాలా ఇష్టం. అతనెవరో నీకు తెలుసా?” అంటూ రివర్స్ క్వశ్చన్ వేశాడు విజయ్. దీంతో విజయ్ నుంచి ఈ ఆన్సర్ ఊహించని ఆ విలేఖరి కళ్లు తేలేశాడు. అరువి లాంటి అద్భుతమైన మూవీ తీసింది ఆ డైరెక్టరే అని విజయ్ తెలిపాడు. అరువి తర్వాత వాజి అనే మూవీని కూడా అరుణ్ ప్రభు తీశాడు అని విజయ్ చెప్పడంతో అక్కడ చప్పట్లు మోగాయి. వీరితో పాటుగా శ్రీకార్తిక్, ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ తీస్తున్న అరుణ్ మాతేశ్వరన్ ను గుర్తు చేశాడు విజయ్ దేవరకొండ. దీంతో విజయ్ ను తక్కువ చేద్దామని చూసిన సదరు విలేఖరికి రివర్స్ లో పంచ్ పడినట్లు అయ్యింది. కాగా.. యూత్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఖుషి మూవీ.. గీతా గోవిందంని మించి సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నాడు విజయ్ దేవరకొండ.

ఇదికూడా చదవండి: కాపీ కాదంటూ.. ‘ఖుషి’ అసలు స్టోరీ లైన్ లీక్ చేసిన సినిమాటోగ్రాఫర్!

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş