iDreamPost
android-app
ios-app

స్టేజ్ పై యంకర్ తో నటుడి అనుచిత ప్రవర్తన! వైరలవుతున్న వీడియో

  • Author Soma Sekhar Published - 03:00 PM, Wed - 20 September 23
  • Author Soma Sekhar Published - 03:00 PM, Wed - 20 September 23
స్టేజ్ పై యంకర్ తో నటుడి అనుచిత ప్రవర్తన! వైరలవుతున్న వీడియో

సాధారణంగా సినిమా ఈవెంట్స్ లో కొందరు నటీ, నటులు ప్రవర్తించే తీరు అవతలి వారికి తీవ్ర ఇబ్బందిని కలుగచేయవచ్చు. ఇక తాము చేసేది తప్పా? ఒప్పా? అని కూడా ఆలోచించకుండా తమకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి లేదా ప్రవర్తించి వార్తల్లో నిలిచి.. విమర్శల పాలవుతుంటారు. తాజాగా ఓ తమిళ నటుడు కూడా ఇలాగే అనుచితంగా ప్రవర్తించి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. స్టేజ్ పై యాంకర్ తో అనుచితంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ ఘటనపై టాలీవుడ్ స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

తమిళ నటుడు కూల్ సురేష్ వివాదంలో చిక్కుకున్నాడు. సరక్కు అనే సినిమా మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ కు హాజరైన ఇతడు.. స్టేజ్ పై ఉన్న యాంకర్ తో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ వేడుకలో మాట్లాడుతూ.. తన పక్కనే ఉన్న యాంకర్ మెడలో పూలమాల వేశాడు. దీంతో ఇబ్బందిగా ఫీలైన సదరు యాంకర్ చిరాకుగా ఆ పూలమాలను తీసేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. అతడిపై తీవ్రంగా మండిపడుతున్నారు నెటిజన్లు. అమె అనుమతి లేకుండా పూలదండ వేయడం సంస్కారమేనా? అంటూ తింటిపోస్తున్నారు నెటిజన్లు.

కాగా.. కూల్ సురేష్ ప్రవర్తనకు అదే స్టేజ్ పై ఉన్న నటుడు మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు చెప్పాడు. ఇక ఈ ఘటనపై స్టార్ సింగర్ చిన్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.” ఇది భయంకరమైన ప్రవర్తన. ఇతడిపై ఎవరూ చర్యలు తీసుకోరు. పైగా దీన్ని పెద్ద వివాదంగా మర్చొద్దని ఆ అమ్మాయి నోరే నొక్కేస్తారు” అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడింది. ఆమెపై పూలమాల వేస్తే కొందరు అబ్బాయిలు చప్పట్లు కొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మన్సూర్ అలీ ఖాన్ సురేష్ చేసిన పని తప్పు అని స్టేజ్ పైనే చెప్పడంతో.. సురేష్ ఆమెకు క్షమాపణలు చెప్పాడు.