iDreamPost
android-app
ios-app

సితార ఫస్ట్ యాడ్ వచ్చేసింది.. తండ్రికి ఏమాత్రం తీసిపోకుండా..!

సితార ఫస్ట్ యాడ్ వచ్చేసింది.. తండ్రికి ఏమాత్రం తీసిపోకుండా..!

సితార ఘట్టమనేని చిన్నగా మహేశ్ కుమార్తె అనే బ్రాండ్ నుంచి బయటకు వచ్చేస్తోందనే చెప్పాలి. తనకంటూ ఓన్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో తన టాలెంట్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా తన డాన్స్ మూవ్స్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వెస్ట్రన్- క్లాసికల్ అని తేడా లేకుండా ప్రతి డాన్స్ ఇరగదీస్తుంది. తాజాగా సితార బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన యాడ్ విడుదలైంది.

సితార ఘట్టమనేని చిన్న వయసులోనే ఒక వరల్డ్ క్లాస్ జ్యూవెలరీస్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఇప్పటికే ఆ యాడ్ గురించి అందరికీ తెలుసు. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో కూడా సితార యాడ్ పిక్స్ ప్లే చేశారు. ఇప్పుడు ఆ యాడ్ కి సంబంధించిన పూర్తి వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ యాడ్ ని ప్రిన్సెస్ అనే షార్ట్ ఫిల్మ్ పేరిట సితార తన యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసింది. యాడ్ చూసిన తర్వాత ఒక నటిగా సితారకు కచ్చితంగా మంచి మార్కులే వేస్తారు. ఒక అమెరికా అమ్మాయి ఫంక్షన్ కోసం ఇండియాకి వస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ లో చూపించారు.

నిజానికి యాడ్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. సితార అమెరికా మనవరాలిగా ఇండియాలో ఉన్న తాత వాళ్ల ఇంటింకి వస్తుంది. ఆమెకు ఆ ఫంక్షన్ అస్సలు ఇష్టం లేదు. చాలా మూడీగా కూర్చొని ఉంటుంది. అయితే మనవరాలిని అలా చూసిన అమ్మమ్మకు ఏమీ అర్థం కాదు. ఎందుకు ఇలా ఉన్నావని అడుగుతుంది. తనకు అలాంటి ఫంక్షన్స్ అంటే ఇష్టం లేదని చెబుతుంది. మనవరాలి మనసు మార్చేందుకు జ్యూవెలరీ షో రూమ్ కు తీసుకెళ్తుంది. అక్కడ నగలు, ఆభరణాలు, వారు ఆమెను మహారాణిగా తయారు చేసిన తీరు చూసి ముగ్దురాలై పోతుంది. ఈ యాడ్ కోసం సితారకు రూ.కోటి వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు టాక్ వచ్చింది. ఆ మొత్తాన్ని ఆమె చారిటీకి డొనేట్ చేసినట్లు మీడియా సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş