iDreamPost
android-app
ios-app

సితార అరుదైన రికార్డు.. ఆ విషయంలో మహేష్‌ను మించి పోయింది!

  • Published Jul 04, 2023 | 3:03 PM Updated Updated Jul 04, 2023 | 3:03 PM
  • Published Jul 04, 2023 | 3:03 PMUpdated Jul 04, 2023 | 3:03 PM
సితార అరుదైన రికార్డు.. ఆ విషయంలో మహేష్‌ను మించి పోయింది!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు- నమ్రతల గారాల పట్టి సితార అరుదైన రికార్డును నెలకొల్పింది. స్టార్‌ హీరో అయిన తండ్రికి కూడా సాధ్య పడని దాన్ని సితార సాధించింది. సినిమాల్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇవ్వక ముందే ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్‌ అయిపోయింది. ఏకంగా టైమ్స్‌ స్వ్కయర్‌ బిల్‌ బోర్డు మీదకు ఎక్కింది. సితార నటించిన పీఎమ్‌జే జ్యువెలరీ యాడ్‌ పోస్టర్‌ టైమ్స్‌ స్క్వయర్‌ బిల్‌ బోర్డుపై ప్రదర్శితమైంది. అది కూడా అమెరికన్‌ ఇండిపెండెన్స్‌ రోజు ఆమె యాడ్‌ టైమ్స్‌ స్వ్కయర్‌ బిల్‌ బోర్డుపై ప్రదర్శితం కావటం విశేషం.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఈ ఫొటోలపై స్పందిస్తున్న మహేష్‌ బాబు ఫ్యాన్స్‌.. సితార సాధించిన ఘనతను చూసి తెగ సంబరపడిపోతున్నారు. ఆ ఫొటోలను తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేస్తూ ఉన్నారు. కాగా, సితార పీఎమ్‌జే జ్యువెలరీస్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఈ యాడ్‌ కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది సితారకు మొదటి కమర్షియల్‌ యాడ్‌ కావటం గమనార్హం.

ఇక, సితార సోషల్‌ మీడియా ఖాతాల్లో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే తన కంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో 12 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. తండ్రి హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాలో ‘పెన్నీ ’ అనే ప్రమోషనల్‌ పాటలో డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఆ పాట యూట్యూబ్‌లో సంచలనం క్రియేట్‌ చేసింది. అంతేకాదు! సితార తండ్రి మహేష్‌ బాబుతో కలిసి పలు షోలలో కూడా సందడి చేసింది. మరి, సితార సాధించిన ఈ అరుదైన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş