iDreamPost
android-app
ios-app

వీడియో: జెస్సీ బర్త్ డే సెలబ్రేట్ చేసిన షన్ను.. ఎర్రిపప్ప అంటూ!

  • Published Aug 28, 2023 | 7:19 PM Updated Updated Aug 28, 2023 | 7:19 PM
  • Published Aug 28, 2023 | 7:19 PMUpdated Aug 28, 2023 | 7:19 PM
వీడియో: జెస్సీ బర్త్ డే సెలబ్రేట్ చేసిన షన్ను.. ఎర్రిపప్ప అంటూ!

ఇండియాలో టాలెంట్ ఉన్న వాళ్లను ఎవరూ ఆపలేరు అని అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా వృద్ధి చెందిన తర్వాత డబ్ స్మాష్, టిక్ టాక్, యూట్యూబ్ ద్వారా ఎంతోమంది సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీలుగా ఎదిగారు. వారిలో ప్రముఖంగా షన్ముఖ్ జశ్వంత్, సిరి హన్మంత్, శ్రీహాన్, దీప్తీ సునైనా వంటి వాళ్ల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. వీళ్లంతా తర్వాత బిగ్ బాస్ ద్వారా కెరీర్ లో ఇంకా ముందుకు వెళ్లడమే కాకుండా.. తెలుగు ప్రజలకు కూడా బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్ గా కూడా బాగా పాపులర్ అయ్యారు.

షన్ముణ్ జశ్వంత్ బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత అతని లైఫ్ ఎంత టర్న్ అయిందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ వల్ల అతనికి ఒకింత నష్టమే జరిగిందని అందరూ చెబుతుంటారు. అయితే బిగ్ బాస్ వల్ల షన్నుకు మంచి కూడా బాగానే జరిగింది. వాటిలో మోడల్ జశ్వంత్ జెస్సీ ఫ్రెండ్ కావడం. అవును బిగ్ బాస్ సీజన్ లో జశ్వంత్ జెస్సీ- షన్ను- సిరి హన్మంత్ చాలా మంచి ఫ్రెండ్స్. సీజన్ మొత్తం వీళ్ల ఫ్రెండ్ షిప్ చూసి తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో మురిసిపోయారు. ఫ్రెండ్స్ అంటే వీళ్లలా ఉండాలి అంటూ చెప్పుకునేవారు. వీళ్లు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ స్నేహాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. జెస్సీ అయితే అందరినీ కలుస్తూ వారితో రీల్స్, డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటాడు. అయితే బిగ్ బాస్ తర్వాత షన్ను మాత్రం పెద్దగా ఫ్రెండ్స్ ని కలిసింది లేదు.

తాజాగా జెస్సీని కలిసి షన్ను సందడి చేశాడు. సోమవారం జశ్వంత్ జెస్సీ పుట్టినరోజు కావడంతో షన్ను పర్సనల్ గా కలిసి కేక్ కట్ చేయించాడు. ఆ కేక్ మీద హ్యాపీ బర్త్ డే ఎర్రిపప్ప అని రాయించాడు. అలాగే విష్ చేయడం కూడా హ్యాపీ బర్త్ డే ఎర్రిపప్ప అని చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన వాళ్ల మధ్య ఉన్న స్నేహాన్ని తెలియజేస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. వీళ్ల స్నేహం చూస్తుటే ముచ్చటేస్తోందని చెబుతున్నారు. వీళ్లు ఇలాగే కలిసుండాలని.. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలి అంటూ విష్ చేస్తున్నారు. షన్ను వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. జెస్సీ హీరో ఎర్రర్ 500 సినిమా చేస్తున్నాడు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను అంటూ చెప్తున్నాడు. కెరీర్ పరంగా ఒక మోడల్ అయిన జెస్సీ ఇప్పుడు రైటర్ గా, యాక్టర్ గా పరిచయం కాబోతున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by jaswanth padala (jessie) (@jaswanth_jessie)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş