iDreamPost
android-app
ios-app

హీరోయిన్లకు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయి: ఆమని

  • Author Soma Sekhar Published - 09:20 PM, Wed - 9 August 23
  • Author Soma Sekhar Published - 09:20 PM, Wed - 9 August 23
హీరోయిన్లకు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయి: ఆమని

ఆమని.. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం హీరోయిన్ లకు తల్లిగా నటిస్తూ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉంది. జంబలకిడిపంబ చిత్రం ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఆమని. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో..వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి. ఇక తెలుగుతో పాటుగా తమిళ చిత్రాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఐడ్రీమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటి నుంచో ఉందని షాకింగ్ కామెంట్స్ చేసింది. అప్పుడు సోషల్ మీడియా లేకపోవడంతో ఆ విషయాలు తెలిసేవి కాదని చెప్పుకొచ్చింది ఆమని.

క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది అలనాటి హీరోయిన్ ఆమని. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ..”ఇండస్ట్రీలో హీరోయిన్లకు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే ఆ టైమ్ లో సోషల్ మీడియా లేకపోవడంతో.. అవి పెద్దగా వెలుగులోకి రాలేదు. ఇక ఏ వృత్తిలోనైనా మంచి, చెడు రెండూ ఉంటాయి. అయితే హీరోయిన్స్ గా అది మనం నిర్ణయం తీసుకోవాలి. ఒకసారి స్విమ్మింగ్ ఫూల్ సీన్ కోసం నా డ్రెస్ తీసి.. నా శరీరంపై ఏమైనా మచ్చలు ఉన్నాయో చూడాలి అన్నారు. దానికి నేను ఒప్పుకోలేదు. అలాంటి క్యారెక్టర్లు వెంటనే వద్దనేదాన్ని” అంటూ తన లైఫ్ లో జరిగిన సంఘటనలను చెప్పుకొచ్చింది ఆమని.

ఇక కొంతమంది డైరెక్టర్ స్టోరీ గురించి మాట్లాడాలి అంటున్నారు, మీరు రావాలంటూ ఫోన్ చేసేవారని, కానీ ఈ విషయాలు అప్పట్లో నాకు అర్ధమయ్యేవి కావని ఆమని పేర్కొంది. కాగా.. ఓ డైరెక్ట్ స్టోరీ గురించి మాట్లాడ్డానికి బీచ్ కు రమ్మనాడని చెప్పుకొచ్చింది ఆమని. బీచ్ కు ఫైనాన్షియర్ వస్తున్నాడు మిమ్మల్ని చూడాలి అంటున్నాడు అని మేనేజర్ చెప్తే.. నిర్మాత, డైరెక్టర్, హీరోలకు నేను నచ్చాలి గానీ.. ఫైనాన్షియర్ నన్ను చూడాలి అనుకోవడం ఏంటి? అంటూ అనుమానం వచ్చేదని ఆనాటి సంఘటనలను గుర్తుచేసుకుంది ఆమని. కొన్ని రోజుల తర్వాత నాకు వారి మైండ్ సెట్ అర్దమైందని ఆమని తెలిపింది. ఇక ఒక్కోసారి మీ అమ్మ వద్దండీ.. మీరు ఒక్కరే రండి అంటూ కారు తీసుకొచ్చేవారని చెప్పుకొచ్చింది. తన కలర్ గురించి కూడా చాలా మంది వల్గర్ గా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. మరి క్యాస్టింగ్ కౌచ్ పై సీనియర్ నటి ఆమని చేసిన షాకింగ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: ‘The’ విజయ్ దేవరకొండ వెనుకున్న అసలు కథ చెప్పిన రౌడీ హీరో!

 

marsbahis giriş