iDreamPost
android-app
ios-app

Samantha & Vijay Deverakonda Movie : సాఫ్ట్ జానర్ లో విజయ్ దేవరకొండ సినిమా

  • Published Mar 22, 2022 | 3:08 PM Updated Updated Mar 22, 2022 | 3:08 PM
  • Published Mar 22, 2022 | 3:08 PMUpdated Mar 22, 2022 | 3:08 PM
Samantha & Vijay Deverakonda Movie : సాఫ్ట్ జానర్ లో విజయ్ దేవరకొండ సినిమా

చైతుతో విడాకులు తీసుకున్నాక చక్కని ప్లానింగ్ తో కెరీర్ సెట్ చేసుకుంటున్న సమంతా త్వరలో విజయ్ దేవరకొండ సరసన నటించడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమాలో కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ ఉంటుందట. లవ్ స్టోరీనా లేక ఇంకేదైనా జానరా అనేది తెలియాల్సి ఉంది. అధిక భాగం చిత్రీకరణ అక్కడే జరుగుతుందని తెలిసింది. ఇంకా అఫీషియల్ అనౌన్స్ చేయలేదు కాబట్టి పూర్తి వివరాలు తెలియలేదు. నిన్ను కోరి, మజిలీలతో రెండు హిట్స్ కొట్టాక శివ నిర్వాణకు టక్ జగదీశ్ షాక్ ఇచ్చింది. ఓటిటిలో రిలీజైనప్పటికీ వీక్ కంటెంట్ వల్ల ఫ్యామిలిస్ నుంచే విమర్శలు ఎదురుకోవాల్సి వచ్చింది.

అందుకే ఇప్పుడిది కంబ్యాక్ హిట్టు కొట్టాలని ప్లాన్ చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ పూర్తి చేసి జనగనమణ కోసం రెడీ అవుతున్నాడు. హెయిర్ స్టైల్ కంప్లీట్ గా మార్చేశాడు. ఇది షూట్ లో ఉందో లేదో క్లారిటీ లేదు. పూరి జగన్నాధ్ టీమ్ లీక్స్ బయటికి రాకుండా జాగ్రత్త పడుతోంది లైగర్ ఎలాగూ ఆగస్ట్ లో విడుదల కాబట్టి ఈ రౌడీ బాయ్ జూన్ దాకా ఖాళీగా ఉన్నట్టే. ఆలోగానే జనగణమన పూర్తి చేయొచ్చు. పుష్ప 2 తర్వాత సుకుమార్ కూడా విజయ్ కి కమిట్ అయ్యాడు. ఎప్పుడో ప్రకటించారు. స్టార్ట్ చేసే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2023 ఫిబ్రవరి లేదా మార్చిలో సెట్స్ పైకి వెళ్లొచ్చు. అంతకన్నా ముందు కష్టమే.

ఇక సమంతా విషయానికి వస్తే పుష్పలో ఊ అంటావా సాంగ్ తనకు ఊహించిన దానికన్నా గొప్ప రెస్పాన్స్ తీసుకొచ్చింది. గ్లామర్ విషయంలో తాను తగ్గేదేలే అని ఇటీవలే జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో సామ్ తన డ్రెస్సింగ్ తో ఇన్ డైరెక్ట్ గా చెప్పిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి-నయనతారలతో కలిసి నటించిన సినిమా ఏప్రిల్ చివరి వారంలో రిలీజవుతుంది. శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ అయ్యాక విడుదల తేదీ ప్రకటిస్తారు. రాజ్ డికెలు తీస్తున్న వెబ్ సిరీస్ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. యశోద సైతం ఇంకో రెండు మూడు నెలల్లో పూర్తయిపోతుంది. మరి విజయ్ దేవరకొండతో జట్టు కట్టడం నిజమో కాదో ఇంకొద్ది రోజుల్లో తేలనుంది

Also Read : RRR : నార్త్ లో బాహుబలి రేంజ్ టాక్ రావాల్సిందే

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş