iDreamPost
android-app
ios-app

సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ హీరోయిన్ మృతి అంటూ పుకార్లు!

  • Published Sep 06, 2023 | 12:34 PM Updated Updated Sep 06, 2023 | 1:03 PM
  • Published Sep 06, 2023 | 12:34 PMUpdated Sep 06, 2023 | 1:03 PM
సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ హీరోయిన్ మృతి అంటూ పుకార్లు!

సినిమా ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేయండ సర్వ సాధారణం. ఎప్పుడూ ఎవరో ఒకరిపై రూమర్స్ స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. అయితే అవి పెళ్లి, ప్రేమ, విడాకులు అంత వరకు అయితే విని ఊరుకోవచ్చు. అయితే ఈ మధ్య చావుల మీద కూడా పుకార్లు పుట్టిస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మందిపై ఈ చావు పుకార్లు వచ్చాయి. తర్వాత వాళ్లు నేను చావలేదు.. బతికేఉన్నాను ఉంటూ మీడియా ముందుకు వచ్చి మొరపెట్టుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఇప్పుడు కన్నడ హీరోయిన్ పై చావు పుకార్లను స్ప్రెడ్ చేశారు.

సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది అంటూ వార్తలు వచ్చాయి. గుండెపోటుతో మరో నటి ప్రాణాలు కోల్పోయింది అంటూ రూమర్స్ స్ప్రెడ్ చేశారు. కన్నడ నటి దివ్య స్పందన అలియాస్ రమ్య గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయారు అంటూ ప్రచారాలు చేశారు. ఈ వార్త విని సినిమా ఇండస్ట్రీ మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే వెంటనే ఆమె చనిపోలేదు బతికే ఉన్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. దివ్య స్పందన క్లోజ్ ఫ్రెండ్ కూడా నేను కాసేపటి క్రితమే మాట్లాడాను ఆమె క్షేమంగానే ఉంది అంటూ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే దివ్య స్పందన బాగానే ఉన్నారు అనే క్లారిటీ వచ్చింది.

దివ్య స్పందన ప్రముఖ హీరోయిన్ మాత్రమే కాదు.. మాజీ ఎంపీ కూడా. తండ్రి చనిపోయిన కేవలం రెండు వారాల వ్యవధిలోనే పార్లమెంట్ లో అడుగుపెట్టి అటు ప్రజాసేవ కూడా చేశారు. దివ్య స్పందన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఈమె తెలుగులో కల్యాణ్ రామ్ తో కలిసి అభిమన్యు సినిమాలో నటించింది. ఆ తర్వాత స్ట్రైట్ సినిమాల్లో చేయకపోయినా.. ఆమె నటించిన చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కన్నడ, తమిళ్, తెలుగు సినిమాలతో అలరించింది. శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, ఉపేంద్ర, సూర్య, శింబు వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbigbossgrandpashabet