iDreamPost
android-app
ios-app

రాకేష్ మాస్టర్ ను చూసి కన్నీరు పెట్టుకున్న శేఖర్ మాస్టర్!

రాకేష్ మాస్టర్ ను చూసి కన్నీరు పెట్టుకున్న శేఖర్ మాస్టర్!

ప్రముఖ టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌.. రాకేష్‌ మాస్టర్‌..  సన్ స్ట్రోక్ కారణంగా ఆదివారం సాయంత్రం మృతి చెందారు. వారం రోజుల క్రితం రాకేష్‌ మాస్టర్‌.. షూటింగ్‌ కోసం వైజాగ్  వెళ్లారు. ఆ షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్‌ వచ్చాడు. అప్పటి నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం ఆయన కన్నుమశారు. రాకేష్‌ మాస్టర్‌ మృతిపై టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాకేష్ మాస్టర్ ను కడసారి చూసేందుకు పలువురు ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లారు. శేఖర్ మాస్టర్ కూడా రాకేశ్ మాస్టార్ ను కడసారి  చూసేందుకు వెళ్లారు.

రాకేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక రాకేష్ మాస్టర్ దగ్గర శేఖర్ మాస్టర్ డాన్స్ నేర్చుకున్నారు. వీరిద్దరి మధ్య గురు శిష్యులు అనుబంధం ఉండేది. ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి వీరి మధ్య ఉన్న గురుశిష్యుల బంధం తెగిపోయింది. ఇక వీరి మధ్య బంధం తెగిపోవడానికి తెరపై ఎన్నో కారణాలు వినిపించాయి. అంతేకాదు వీళ్ళిద్దరూ యూట్యూబ్ ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు పరస్పరం ఎన్నో విమర్శలు చేసుకున్నారు. వారిద్దరి బంధం బాగా ఉన్నప్పుడు శేఖర్ మాస్టర్ ని రాకేష్ మాస్టార్ చాలా బాగా చూసుకున్నారంట. పలు సందర్భాల్లో రాకేశ్ మాస్టర్.. శేఖర్ మాస్టర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతలా కలిసి ఉన్న వాళ్లు వివిధ కారణాలతో విడిపోయారు.

ఈ క్రమంలో ఆదివారం రాకేశ్ మాస్టార్ మృతి చెందారు. పలువురు సినీ ప్రముఖులు రాకేశ్ మాస్టర్ మృతికి సంతాపం  తెలియజేశారు. మరి కొందరు ఆయన పార్ధీవ దేహం  చూసేందుకు ఆయన నివాసంకి వెళ్లారు. అయితే శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టార్ చివరి చూపు చూడడానికి వస్తారో లేదో అని చాలా మంది సందేహం వ్యక్తం చేశారు.  అయితే అందరి రాకేశ్ మాస్టార్ ను చివరి చూపు చూసేందుకు శేఖర్ మాస్టార్ వెళ్లారు. రాకేష్ మాస్టార్ భౌతికకాయం చూసి శేఖర్ మాస్టార్ కన్నీరు పెట్టుకున్నారు. ఈ  ఘటన చూసిన చాలా మంది.. పంతాలను పక్కన పెట్టి.. ఇలా కడసారి చూపుకు రావడం చాలా గొప్ప విషయమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetparkgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom