iDreamPost
android-app
ios-app

Raashi Khanna : ఇంతకన్నా బంపర్ ఆఫర్ ఉంటుందా

  • Published Mar 17, 2022 | 3:28 PM Updated Updated Dec 19, 2023 | 2:46 PM

అజయ్ దేవగన్ తో కలిసి నటించిన రుద్ర వెబ్ సిరీస్ లో చెప్పుకోదగ్గ పేరే వచ్చింది. ఇదిలా ఉండగా తనకు ప్రభాస్ సరసన నటించే బంపర్ ఆఫర్ దక్కినట్టు లేటెస్ట్ అప్ డేట్. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా డివివి దానయ్య ఒక ఎంటర్ టైనర్ నిర్మించబోతున్న సంగతి తెలిసిందే.

అజయ్ దేవగన్ తో కలిసి నటించిన రుద్ర వెబ్ సిరీస్ లో చెప్పుకోదగ్గ పేరే వచ్చింది. ఇదిలా ఉండగా తనకు ప్రభాస్ సరసన నటించే బంపర్ ఆఫర్ దక్కినట్టు లేటెస్ట్ అప్ డేట్. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా డివివి దానయ్య ఒక ఎంటర్ టైనర్ నిర్మించబోతున్న సంగతి తెలిసిందే.

  • Published Mar 17, 2022 | 3:28 PMUpdated Dec 19, 2023 | 2:46 PM
Raashi Khanna : ఇంతకన్నా బంపర్ ఆఫర్ ఉంటుందా

ఒకప్పుడు మంచి అవకాశాలే ఉండేవి కానీ ఈ మధ్య కాలంలో కనిపించడం బాగా తగ్గించేసిన రాశి ఖన్నా ఇటీవలే ఓటిటి డెబ్యూ చేసింది. అజయ్ దేవగన్ తో కలిసి నటించిన రుద్ర వెబ్ సిరీస్ లో చెప్పుకోదగ్గ పేరే వచ్చింది. ఇదిలా ఉండగా తనకు ప్రభాస్ సరసన నటించే బంపర్ ఆఫర్ దక్కినట్టు లేటెస్ట్ అప్ డేట్. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా డివివి దానయ్య ఒక ఎంటర్ టైనర్ నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా లెవెల్ వందల కోట్లతో కాకుండా డీసెంట్ బడ్జెట్ తో దీన్ని పూర్తి చేయబోతున్నారు. రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ప్రాజెక్టు అనౌన్స్ చేసే టైంలో ఇస్తారు.

దీని తాలూకు ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ మొదలయ్యాయి. ఇప్పుడు రాశి ఖన్నా నిజంగా ఓకే అయితే తనకిది పెద్ద బ్రేక్ అవుతుంది. మారుతీ గత రెండు సినిమాల్లోనూ ఆమెనే హీరోయిన్. సాయి ధరమ్ తేజ్ తో చేసిన ప్రతిరోజు పండగే సూపర్ హిట్ కాగా గోపీచంద్ పక్కా కమర్షియల్ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తోంది. దీని మీద పాజిటివ్ హైప్ అయితే ఉంది. ఇప్పుడిది వరసగా మూడోసారి. ఇందులో ఒక్క హీరోయిన్ కాదట. మాళవిక మోహనన్ ని ఆల్రెడీ లాక్ చేసుకున్నట్టు తెలిసింది. మూడో కథానాయిక కోసం వేట కొనసాగుతోందని ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి లేదా మెహ్రీన్ లాంటి ఒకటి రెండు ఛాయస్ లను పరిశీలిస్తున్నట్టు వినికిడి.

మొత్తానికి మారుతీ గట్టి ప్లాన్ లోనే ఉన్నాడు. ఇటీవలే విడుదలైన రాధే శ్యామ్ ప్రభాస్ ఊహించని దెబ్బేసింది. జనం నిర్మొహమాటంగా తిరస్కరించడంతో సాహోనే చాలా నయమనిపించేలా డిజాస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. బాహుబలి తర్వాత ఎక్కువ గ్యాప్ తో చేసిన రెండు సినిమాలు నిరాశపరచడంతో డార్లింగ్ ఇకపై గ్రాఫిక్స్ మీద కాకుండా కంటెంట్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే మారుతీ ఇచ్చే ఎంటర్ టైనర్ మీద అభిమానులు చాలా ఆశలు పెట్టుకుంటున్నారు. ఇది ఆది పురుష్, సలార్ తర్వాత వస్తుందా లేదా మధ్యలో సెట్ చేస్తారా అనేది ఇప్పుడే చెప్పలేం. మారుతీ వేగంగా తీసే మాట వాస్తవం

Also Read : Nivetha Pethuraj : నివేత పేతురాజ్ కు మెగా ఛాన్స్

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş