Dharani
Dharani
ప్రియాంక చోప్రా గురించి భారతీయ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మిస్ వరల్డ్‌కిరీటం గెలుచుకుని.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత హాలీవుడ్ అవకాశాలు అందిపుచ్చుకుని.. అక్కడ రాణిస్తోంది. అంతేకాక అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ఇక ఈమధ్య కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలుస్తోంది ప్రియాంక చోప్రా. గతంలో భారతీయ సినిమాల గురించి ప్రియాంక చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు తాజాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రియాంకకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ప్రియాంక నయంకాని వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆ విషయం తెలిసి ఆమె అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఇంతకు ఏ వ్యాధి అంటే..
ప్రియాంక చోప్రా నయం కాని వ్యాధితో బాధపడుతుంది. ఐదేళ్ల ప్రాయం నుంచి ఆస్తమాతో ఇబ్బంది పడుతోంది ప్రియాంక చోప్రా. ఆమె 1982, జూలై 18న జార్ఖండ్‌లో జన్మించింది. ఇక ఆమెకు ఐదేళ్ల వయసులో ఆస్తమా ఉందని తెలిసింది. ఇక వ్యాధి బారిన పడిన వారు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శీతాకాలంలో మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఇక తినే ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా చల్లని పదార్థాలు తినకూడదు. జీవితాంతం ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇక ప్రియాంక కూడా ఆస్తమా కారణంగా అలాంటి ఇబ్బందులే ఎదుర్కొంది. అయితే ఆమె జీవితంలో కలిసిన ఓ వ్యక్తి కారణంగా.. ఈ వ్యాధి గురించి తాను పెద్దగా భయపడలేదని తెలిపింది.
ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఒకరు.. జీవితంలో ఎంతో ఎదిగాడని.. కీర్తి సాధించాడని.. అతడిని ఆదర్శంగా తీసుకునే తానే ఆస్తామా ఉన్నప్పటికి.. జీవితంలో ముందుకు సాగుతున్నానని ప్రియాంక చెప్పుకొచ్చింది. ఆస్తమా కారణంగా తన వద్ద ఇన్‌హేలర్ ఎప్పుడు అందుబాటులో ఉంచుకుంటానని చెప్పుకొచ్చింది. ఇన్‌హేలర్ లేకపోతే చాలా ఇబ్బంది పడతానని చెప్పుకొచ్చింది. ఆస్తమా వల్ల తాను ఇబ్బంది పడ్డప్పటికి.. అది తన కెరీర్‌కు ఎప్పుడు అడ్డంకి కాలేదని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా. హీరో చిత్రం ద్వారా 2003 సినిమాలో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక చోప్రా. ఆ తర్వాత హాలీవుడ్‌పై దృష్టి సారించింది. ఇక కొన్ని రోజుల క్రితం ప్రియాంక నటించిన సిటాడెల్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అయ్యింది. 2018లో నిక్ జోనాస్‌ను వివాహం చేసుకుంది ప్రియాంక. ఇక ఈ జంట 2022లో సరోగసీ ద్వారా తల్లిదండ్రులయ్యారు. చిన్నారి పేరు మాల్తీ మేరీ చోప్రా జోనాస్.