Uppula Naresh
Uppula Naresh
ఆదివారం జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (TFCC) ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 3 సమయానికి ముగిసింది. పోటాపోటీగా సాగిన ఈ ఎన్నికల్లో నిర్మాత దిల్ రాజు ప్యానెల్, సీ. కళ్యాణ్ ప్యానెల్ పోటీ పడ్డాయి. అయితే ఈ ఎన్నికల్లో మొత్తంగా 1200 పైగా ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ఎలక్షన్ ఫలితాలు నేడే వెలువడనున్నాయి. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై 6 గంటలకు పూర్తి ఫలితాలు వెల్లడవుతాయి. కాగా, ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో గెలిచేదెవరో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది నటీ, నటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఈ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికీ చాలా మంది భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు చూస్తుంటే ఛాంబర్ ఎదిగిందని సంతోషపడాలో లేక సాధారణ ఎన్నికల వాతావరణంలా మారిందని సిగ్గు పడాలో తెలియడం లేదని అన్నారు. నిర్మాత బండ్ల గణేష్ మాత్రం ఏకంగా ఎవరు గెలుస్తారో నాకు తెలుసని, గెలిచిన వారికి అభినందనలు, ఓడిపోయిన వారికి బెస్ట్ ఆఫ్ లక్ అని అన్నారు. మొత్తానికి TFCC ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచేదెవరు అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
ఇది కూడా చదవండి: TFCC ఎన్నికలపై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు!