రజినీకాంత్ జైలర్ బాక్సాఫీస్ ఊచకోత.. అన్ని రికార్డులను తుడిచిపెట్టేస్తూ..!

రజినీకాంత్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇటీవల విడుదలైన జైలర్ సినిమా మేనియాలో సినిమా ప్రేక్షుకులు అంతా ఉర్రూతలూగుతున్నారు. పాన్ ఇండియానే కాదు.. వరల్డ్ వైడ్ గా జైలర్ సినిమా రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన జైలర్ సినిమా బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తోంది. విడుదలైన 3 రోజుల్లోనే రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ రజినీ స్టామినా ఏంటో ఇండస్ట్రీకి తెలిసేలా చేస్తోంది. ఇదే జోరు కొనసాగితే జైలర్ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం.

జైలర్ సినిమా శనివారం చాలా మంచి కలెక్షన్స్ సాధించింది. అటు తెలుగులో కూడా థియేటర్లు హౌస్ ఫుల్ గా నడిచాయి. 11వ తారీఖు భోళా శంకర్ పోటీ ఇవ్వడంతో కాస్త కలెక్షన్స్ తగ్గాయి. కానీ, శనివారం జైలర్ సినిమా మళ్లీ పుంజుకుంది. కలెక్షన్స్ లో రికార్డులు సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ.95.78 కోట్లు, రెండో రోజు రూ.56.24 కోట్లు కలెక్ట్ చేయగా ఇంక మూడో రోజు మళ్లీ జోరు పెంచింది. వరల్డ్ వైడ్ గా మూడో రోజు జైలర్ సినిమా రూ.68.51 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఈ సినిమా మూడ్రోజుల్లో రూ.220.53 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటికే రూ.200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ లో అత్యంత వేగంగా 200 కోట్ల క్లబ్ లో చేరిన సినిమా రికార్డులు సృష్టిస్తోంది.

నెల్సన్- రజినీకాంత్ కాంబోలో వచ్చిన జైలర్ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇవాళ ఆదివారం కావడంతో జైలర్ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు పాన్ ఇండియా లెవల్లో జైలర్ కు పోటీ ఇచ్చే మరే సినిమా కూడా కనిపించడం లేదు. ఈ వీక్ లాంగ్ రన్ లో జైలర్ సినిమా కలెక్షన్స్ లో ఊచకోత కోయడం ఖాయంగా చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఫలితాల విషయంలో రజినీకాంత్ సినిమాలు కాస్త నిరాశ పరిచినా కూడా జైలర్ మాత్రం ఫ్యాన్స్ లో కొత్త జోష్ ని నింపింది. మరోవైపు అనిరుధ్ మ్యూజిక్ కోసం కూడా ప్రేక్షకులు రిపీట్ గా థియేటర్ కి వెళ్తున్నారు అనడంలో ఎలాటిం సందేహం లేదు. టైగర్ కా హుకుం పాట సోషల్ మీడియా, యూట్యూబ్ లో ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్ లోనే ఉంది. ఈ మూవీతో రజినీకాంత్ మళ్లీ గాడిలో పడ్డట్లు అయింది. ఆయన స్టామినా ఏంటో మరోసారి పాన్ ఇండియా లెవల్లో రీసౌండింగ్ వచ్చింది.

Show comments