విశాల్ పై హైకోర్టు ఆగ్రహం.. చట్టం ముందు అందరూ సమానమే అంటూ..!

  • Author Soma Sekhar Published - 01:08 PM, Sat - 23 September 23
  • Author Soma Sekhar Published - 01:08 PM, Sat - 23 September 23
విశాల్ పై హైకోర్టు ఆగ్రహం.. చట్టం ముందు అందరూ సమానమే అంటూ..!

‘మార్క్ ఆంటోని’ మూవీ సక్సెస్ లో ఉన్నాడు స్టార్ హీరో విశాల్. అయితే ఈ సక్సెస్ ను పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు విశాల్. తాజాగా విశాల్ పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గాను కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. న్యాయస్థానం ముందు అందరూ సమానమే అని, మీకు మీరు ఉన్నతంగా భావించుకోకూడదంతూ చివాట్లు పెట్టింది. అదీకాక కొన్ని ఇటీవల విశాల్ కు నిర్మాతల సంఘం రెడ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకున్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు అదే కేసులో హైకోర్టు విశాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

హీరో విశాల్.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కకుని వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. గత కొన్ని రోజులుగా విశాల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. తాజాగా విశాల్ పై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విశాల్ తన నిర్మాణ సంస్థ కోసం సినీ ఫైనాన్షియర్ అయిన అన్భుచెజియన్ సంబంధించిన గోపురం ఫిల్మ్స్ నుంచి రూ.21.29 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఇక రుణాన్ని లైకా ప్రొడక్షన్స్ గోపురం ఫిల్మ్స్ సంస్థకు చెల్లించింది. అయితే ఈ అప్పును విశాల్ లైకా ప్రొడక్షన్స్ కు తిరిగి చెల్లించే వరకు అతని అన్ని సినిమా హక్కులు లైకా ప్రొడక్షన్స్ కు ఇవ్వాలని ఒప్పంద కుదుర్చుకుంది.

కాగా.. ఈ అగ్రిమెంట్ ను ఉల్లంఘించిన విశాల్ ‘వీరమే వాగై చూడం’ సినిమాను రిలీజ్ చేసినందుకు విశాల్ పై లైకా మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. దీంతో కేసును గతంలో విచారించిన కోర్టు అతడిని రూ. 15 కోట్లు జాతీయ బ్యాంక్ లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఇలా చేయని పక్షంలో అతడి సినిమాలు థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. అదీకాక విశాల్ కు చెందిన బ్యాంక్ ఖాతా వివరాలను, స్థిరాస్తుల పత్రాలను కోర్టులో దాఖలు చేయాలని ఆదేశించగా.. అతడు వాటిని కోర్టుకు సమర్పించకపోవడంతో.. సెప్టెంబర్ 22నన విశాల్ స్వయంగా కోర్టుకు హాజరుకావాలని కోరింది.

తాజాగా మరోసారి ఈ కేసు విచారణకు రాగా.. విశాల్ తరపున న్యాయవాది కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించారు. బ్యాంకు నుంచి పత్రాలు రావడం ఆలస్యం కావడంతో.. జాప్యం జరిగిందని, కోర్టు అడిగిన పత్రాలను ఆన్ లైన్ లో సమర్పించినట్లుగా తెలిపారు. ఆస్తి వివరాలు దాఖలు చేయడానికి 6 రోజుల గడువు కావాలని విశాల్ తరపు న్యాయవాది కోరాగ.. కోర్టు ఆమెదం తెలిపింది. అలాగే తదుపరి విచారణ సమయంలో విశాల్ 28 రోజుల పాటు షూటింగ్ లో ఉండటం వల్ల వ్యక్తిగతంగా హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరగా.. కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 25కి వాయిదా వేశారు. మరి విశాల్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments