iDreamPost
android-app
ios-app

దుల్కర్ నే కాదు.. తననీ టచ్ చేశారంటూ కస్తూరి ఎమోషనల్!

  • Published Aug 26, 2023 | 5:01 PM Updated Updated Aug 26, 2023 | 5:01 PM
  • Published Aug 26, 2023 | 5:01 PMUpdated Aug 26, 2023 | 5:01 PM
దుల్కర్ నే కాదు.. తననీ టచ్ చేశారంటూ కస్తూరి ఎమోషనల్!

ఇండియన్ సినిమాలో గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోహీరోయన్లు ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి స్టార్లు సైతం కెరీర్ ప్రారంభంలో వారికి జరిగిన కొన్ని చేదు అనుభవాలను ఇప్పుడు ప్రేక్షకులు, ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. ముఖ్యంగా మీటూ, అవకాశాల కోసం కమిట్మెంట్ అడగడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి అంశాలను కూడా ఇప్పుడు చర్చకు తీసుకొస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా హీరో దుల్కర్ సల్మాన్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకున్న విషయం తెలిసిందే. తనను అసభ్యంగా తాకారంటూ దుల్కర్ చెప్పుకొచ్చాడు.

దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలో దుల్కర్ సల్మాన్ ఓసారి తనకు ఇలాంటి ఘటన ఎదురైంది అంటూ చెప్పుకొచ్చాడు. తనని ఒక మహిళ అసభ్యంగా తాకినట్లు చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తనకు ఎంతగానో బాధ కలిగిందని.. ఆ ఘటన తనను బాధించిందని చెప్పాడు. ఈవెంట్స్ లో ఫ్యాన్స్ మధ్యకు వస్తే అలాంటి ఘటనలు జరుగుతుంటాయని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై నటి కస్తూరి స్పందించారు. దుల్కర్ కు మాత్రమే కాదని.. తనకు కూడా అలాంటి ఘటనలు ఎదురయ్యాయి అంటూ చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలో నటీనటులు చాలా సందర్భాల్లో ఇబ్బదులకు గురవుతున్నట్లు చెప్పారు. కొంత మంది ఈ విషయాలను బటకు చెబుతుంటే.. కొందరు మాత్రం నోరు మెదపడం లేదన్నారు. దుల్కర్ సల్మాన్ చెప్పినలాంటి ఘటనే తన జీవితంలో జరిగిందంటూ కస్తూరి కామెంట్ చేశారు. కోలీవుడ్ స్టార్స్ అసోసియేషన్ ఈవెంట్ లో తనపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపించారు. తన తండ్రితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న సమయంలో ఎవరో ఒకరు వెనకి నుంచి తనని నొక్కినట్లు అనిపించింది అన్నారు. ఆ చేయి పట్టుకుని ముందుకు లాగి తనని నిలదీసినట్లు చెప్పారు. అతను విపరీతంగా ఏడుస్తూ అక్కా సారీ అక్కా అంటూ మొర పెట్టుకున్నట్లు చెప్పారు.

చేయాల్సింది అంతా చేసి ఇప్పుడు అక్కా అని ఏడిస్తే ఏం లాభం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఇలాటి చెత్త పనులు చేసి అక్కా అంటూ వేడుకున్నాడు అన్నారు. అలాగే నెటిజన్స్ పై కూడా కస్తూరి కామెంట్స్ చేశారు. చాలామంది తమ వ్యక్తిగత జీవితంలో ఒత్తిడికి గురవుతున్న విషయాన్ని వెల్లడించారు. అలాంటి వారు తన సోషల్ మీడియా అకౌంట్స్ కామెంట్ బాక్సులోకి వచ్చి తనపై సైబర్ దాడులకు దిగుతున్నట్లు చెప్పారు. చాలా మంది తన కామెంట్ బాక్సులో అసభ్యకర సందేశాలు పెడుతున్న విషయాన్ని వెల్లడించారు. ఇంక కస్తూరి శంకర్ కెరీర్ విషయాని వస్తే గృహలక్ష్మి సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss