iDreamPost
android-app
ios-app

వీడియో: స్టేజ్ పైనే గొడవపడ్డ ఇమాన్యుయేల్, యాదమ్మరాజు!

  • Author Soma Sekhar Published - 10:00 PM, Tue - 26 September 23
  • Author Soma Sekhar Published - 10:00 PM, Tue - 26 September 23
వీడియో: స్టేజ్ పైనే గొడవపడ్డ ఇమాన్యుయేల్, యాదమ్మరాజు!

బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు ప్రసారం అవుతూ ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ.. కొనసాగుతున్నాయి. అలాంటి షోలలో జబర్దస్త్ తొలి స్థానంలో ఉండగా.. శ్రీదేవి డ్రామా కంపెనీ తర్వాత స్థానంలో ఉందనే చెప్పాలి. అయితే మిగతా షోలకు కూడా ఉన్నప్పటికీ వీటికి వచ్చినంత క్రేజ్ వాటికి లేదనే చెప్పాలి. పైగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా అక్టోబర్ 1వ తేదీకి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. తొలిసారిగా రూ. 5 లక్షల క్యాష్ ప్రైజ్ ను అనౌన్స్ చేసి.. ఐదు జంటలను వేదికపైకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే యాదమ్మ రాజుకు ఇమ్మాన్యుయేల్ కు మధ్య గొడవ జరిగింది. దీంతో ఇమ్మాన్యుయేల్ తన షర్ట్ తీసి కిందకొట్టి.. షో నుంచి వెళ్లిపోయాడు.

శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటుంది. తాజాగా అక్టోబర్ 1వ తేదీకి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో రూ. 5 లక్షల క్యాష్ ప్రైజ్ ను అనౌన్స్ చేశారు. ఈ పోటీలో 5 జంటలు పాల్గొన్నాయి. ఈ కపుల్స్ కాంటెస్ట్ లో ఏక్ నాథ్-హారిక, రోహిత్-మెరీనా, ఇమ్మాన్యుయేల్-వర్ష, యాదమ్మ రాజు-స్టెల్లా, పండు-ఆరియానా, నాగేష్-ప్రీతినిగం పాల్గొన్నాయి. వీరందరు తమదైన శైలిలో పాటలతో ఆటలతో మెస్మరైజ్ చేశారు.

ఈ క్రమంలోనే యాదమ్మ రాజు-స్టెల్లా కలిసి ‘ఒయ్ రాజు కన్నుల్లో నువ్వే.. ఒయ్ రాజు గుండెల్లో నువ్వే’ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ జంట డ్యాన్స్ కు జడ్జిమెంట్ ఇచ్చే క్రమంలో ఇమ్మాన్యుయేల్.. యాదమ్మ రాజు డ్యాన్స్ నచ్చలేదని చెప్పాడు. దీంతో కోపంతో ఏం నచ్చలేదని యాదమ్మరాజు అడిగాడు. మధ్యలో స్టెల్లా కలగజేసుకుని.. నచ్చినా, నచ్చకపోయినా కనీసం 100కు ఒక్క మార్కు అయినా ఇవ్వాలిగా అని ప్రశ్నించింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఇమ్మాన్యుయేల్ తన షర్ట్ విప్పి స్టేజ్ పై విసిరేసి.. షో నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. మరి వీరి గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: శివపార్వతులుగా ప్రభాస్, నయనతార.. లీక్ చేసిన సీనియర్ హీరోయిన్

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş