iDreamPost
android-app
ios-app

గుప్పెడంత మనసు సీరియల్ జగతికి భారీ క్రేజ్! కుర్రాళ్ళు ఫిదా!

  • Published Aug 30, 2023 | 4:25 PM Updated Updated Aug 30, 2023 | 4:25 PM
  • Published Aug 30, 2023 | 4:25 PMUpdated Aug 30, 2023 | 4:25 PM
గుప్పెడంత మనసు సీరియల్ జగతికి భారీ క్రేజ్! కుర్రాళ్ళు ఫిదా!

జ్యోతి రాయ్.. ఈ పేరు చెప్తే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు. కానీ, జగతి అనగానే బుల్లితెర ప్రేక్షకుల టక్కున గుర్తు పట్టేస్తారు. గుప్పెడంత మనసు సీరియల్ జగతికి తెలుగుల  చాలామంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సీరియల్ ద్వారా ఒక లక్షణమైన తెలుగుంటి ఇల్లాలిగా కన్నడ నటి జ్యోతిరాయ్ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే జ్యోతి రాయ్ కన్నడ చాలా మంచి గుర్తింపు సాధించిన నటి. అలాగే హీరోయిన్ చాలా సినిమాలు చేసింది. అలాగే తులు టీవీ సీరియల్స్ కూడా చాలా చేసింది. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ సీరియల్ లో జ్యోతి రాయ్ ని చూసిన వాళ్లు ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తే అస్సలు పోల్చుకోలేరు ఏమో. ఎందుకంటే ఆమె తన వయసు కంటే ఎంతో పెద్ద వయసు కలిగిన పాత్ర చేస్తోంది. ఆ పాత్రకు తగ్గట్లు చీరలు కట్టుకోవడం, పెద్ద బొట్టు పెట్టుకోవడం చేస్తుంటుంది. అయితే జ్యోతి రాయ్ తన రియల్ లైఫ్ లో మాత్రం ఎంతో మోడ్రన్ గా ఉంటుంది. పైగా మళ్లీ లీడ్ రోల్ లో సినిమాలు చేయడం కూడా ప్రారంభించింది. ఇటీవల తల్లి పాత్రలో నటించిన A మాస్టర్ పీస్ అనే సినిమాకి సంబంధించి ప్రీ టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ సినిమాలో జగతి సీరియల్ లో చూపించిన విధంగానే ఉంది. ప్రస్తుతం మాత్రం ఎంతో మారిపోయింది.

 

View this post on Instagram

 

A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial)

A మాస్టర్ పీస్ సినిమా షూటింగ్ తన ఛేంజ్ ఓవర్ కి ముందు చేసినట్లు చెప్పింది. కానీ, జనవరి తర్వాత తాను కంప్లీట్ గా మేకోవర్ అయిన విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం మోడ్రన్ డ్రెస్సుల్లో చేస్తున్న ఫొటో షూట్లు, చేస్తున్న పోస్టులు చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. జగతి మేడమేనా? అంటూ నోరెళ్లబెడుతున్నారు. కొంతమంది అయితే మీరు హీరోయిన్ కదా.. ఎందుకు సీరియల్స్ చేస్తున్నారు అంటూ పొగడ్తలతో ముంచెత్తున్నారు. మూవీస్ కోసమే జ్యోతి రాయ్ ట్రాన్స్ ఫర్మేషన్ అయినట్లు చెబుతున్నారు. హీరోయిన్ గా వరుస ప్రాజెక్టులు చేస్తారంటూ టాక్ నడుస్తోంది. ప్రిటీ గర్ల్ అనే హిందీ- ఇంగ్లీష్ ప్రాజెక్టులో లీడ్ యాక్ట్రెస్ గా చేస్తున్నట్లు ఇప్పటిికే ప్రకటించింది. ఇదొక రొమాంటిక్ క్రైమ్ డ్రామా కథగా చెప్పారు.

 

View this post on Instagram

 

A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial)

సినిమాలు, సీరియల్స్ సంగతి పక్కన పెడితే జ్యోతి రాయ్ కి ఇన్ స్టాగ్రామ్ లో క్రేజ్ అమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి. జగతి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆమెకు 20 ఏళ్లకే వివాహం జరిగినట్లు చెబుతున్నారు. ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాయి. అయితే భర్తకు దూరంగా ఉంటూ ఒక డైరెక్టర్ తో చనువుగా ఉంటున్నారు అంటూ పుకార్లు వచ్చాయి. వాటిపై గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. “మీకు అర్థంకాని వాటిపై విమర్శలు చేయకండి.. నా జీవితంలోకి వచ్చి మీరు చూడలేరు” అంటూ కామెంట్ చేసింది. విమర్శలు, పొగడ్తలు సంగతి పక్కన పెడితే జ్యోతి రాయ్ కి మాత్రం బుల్లితెరలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş