iDreamPost
android-app
ios-app

దీనస్థితిలో గాయత్రి గుప్తా.. విరాళాలు అడగాలనుకుంటున్నా అంటూ!

  • Author Soma Sekhar Published - 02:50 PM, Sat - 9 September 23
  • Author Soma Sekhar Published - 02:50 PM, Sat - 9 September 23
దీనస్థితిలో గాయత్రి గుప్తా.. విరాళాలు అడగాలనుకుంటున్నా అంటూ!

సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ రంగుల ప్రపంచంలో అందరి జీవితాల్లో వెలుగుజిలుగులు ఉంటాయి అనుకుంటే పొరపాటే. ఇక సెలబ్రిటీల లైఫ్ అంటేనే లగ్జరీ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ.. ఇండస్ట్రీలో చాలా మంది నటీ, నటుల జీవితాల్లో ఎన్నో విషాదాలు ఉంటాయి. అలాంటి విషాదామే తన జీవితంలో కూడా ఉందని చెప్పుకొచ్చింది నటి గాయత్రి గుప్తా. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం గురించి సంచలన విషయాలు వెల్లడించింది. తన ఆరోగ్యం బాలేదని, డబ్బులు కూడా లేవని, విరాళాలు అడగాలనుకుంటున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

గాయత్రి గుప్తా.. షార్ట్ ఫిల్మ్ ల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన నటనతో వెండితెరపైకి దూసుకొచ్చింది. ఇక ఎప్పటికప్పుడు బోల్డ్ ఇంటర్వ్యూలు ఇస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారేది. గతంలో బిగ్ బాస్ షో పై పలు ఆరోపణలు చేయడం ద్వారా వైరల్ గా మారింది ఈ అమ్మడు. ఇక టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఉన్న క్రమంలో ఆమెకు అనుకోని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో డాక్టర్ల దగ్గరకు వెళ్తే.. మూడు సంవత్సరాల కంటే ఎక్కువ మీరు బతకరు అని చెప్పారు. ఈ న్యూస్ అప్పట్లో వైరల్ అయ్యింది. తాజాగా మరోసారి తన ఆరోగ్యం గురించి షాకింగ్ విషయాలను వెల్లడించింది గాయత్రి గుప్తా.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకు సంబంధించి విడుదలైన ప్రోమోలో ఈ విషయాలను పంచుకుంది. గాయత్రి గుప్తా మాట్లాడుతూ..”ప్రస్తుతం నా ఆరోగ్యం బాలేదు. తెల్లారితే ఏం జరుగుతుందో కూడా తెలీదు. నాకు వెంటనే ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు చెప్పారు. ఈ ఆపరేషన్ కు దాదాపుగా రూ.10 లక్షలకు పైనే కావాలి. కానీ ప్రస్తుతం నా దగ్గర అంత మనీ లేదు. దీంతో నా హెల్త్ కోసం విరాళాలు అడగాలని అనుకుంటున్నాను” అంటూ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక గాయత్రి గుప్తాకు వెన్నుముకలో ఉన్న సమస్య కారణంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం ఈ సమస్యలతో ఆమె తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విరాళాలు అడగాలని నిర్ణయించుకున్నాట్లు చెప్పుకొచ్చింది. మరి దీన స్థితిలో ఉన్న నటి గాయత్రి గుప్తాకు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా హెల్ప్ చేస్తారో చూడాలి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş