iDreamPost
android-app
ios-app

‘కొత్త ప్రేమను కనుగొన్నా’ వైరలవుతున్న సమంత పోస్ట్!

  • Author Soma Sekhar Published - 01:00 PM, Sun - 20 August 23
  • Author Soma Sekhar Published - 01:00 PM, Sun - 20 August 23
‘కొత్త ప్రేమను కనుగొన్నా’ వైరలవుతున్న సమంత పోస్ట్!

సమంత.. గత కొంతకాలంగా ఈ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దానికి అనేక కారణాలు ఉన్నాయన్న సంగతి మనందరికి తెలిసిందే. టాలీవుడ్ తో పాటుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది సామ్. ప్రస్తుతం సమంత మయోసైటిస్ జబ్బుతో బాధపడుతున్న విషయం విదితమే. ఓ వైపు ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ వచ్చింది సామ్. కాగా.. ఖుషి సినిమా ఆడియో ఫంక్షన్ లో విజయ్ తో కలిసి డ్యాన్స్ చేసింది సమంత. వీరిద్దరి డ్యాన్స్ బాగా వైరల్ కావడంతో.. మూవీపై మరింతగా బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే నేను కొత్త లవ్ ను కనుగొన్నాను అంటూ పోస్ట్ చేసింది సామ్.

సమంత తాజాగా నటించిన చిత్రం ఖుషి. ఈ మూవీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన సామ్ నటించింది. ఇక ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. అయితే ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సామ్ రాలేకపోయింది. కానీ ఆడియో ఫంక్షన్ కు హాజరై సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ ఈవెంట్ లో విజయ్-సామ్ కలిసి చేసిన డ్యాన్స్ విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో మూవీపై బజ్ ఇంకాస్త పెరిగింది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్.. సినిమాల నుంచి కొంత విరామం తీసుకుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటూ.. తన జీవితానికి సంబంధించిన అప్డేట్స్ ను పోస్ట్ చేస్తూనే ఉంది.

తాజాగా మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. న్యూ లవ్ అనే పదంతో ఆ పోస్ట్ ను ప్రారంభించింది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే? ఒక వాటర్ గ్లాస్ ఉన్న పిక్ ను షేర్ చేసి..”తళుక్కున మెరిసే నీటి పట్ల న్యూ లవ్ ను కొనుగొన్నా.. కొత్త అక్షరాలతో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి” అంటూ మూడు లవ్ ఎమోజీలను చేర్చి తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ఇక ఈ పిక్ లో మరో విషయం ఏంటంటే? సామ్ చేతికి లవ్ అనే అక్షరాలు ఉన్నా బ్రాస్ లెట్ ఉండటం మనం చూడొచ్చు. కాగా.. సమంత పెట్టిన ఈ పోస్ట్ కు అర్ధం ఏంటి? అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో.. అభిమానులు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఆ పోస్ట్ వెనక ఉన్న ప్రేమ ఏంటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: సింగర్‌, జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు.. కారణమిదే!

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet