iDreamPost
android-app
ios-app

Fan Wars : మేమంతా ఒకటే అన్న హీరోల మాటలు వినరా

  • Published Mar 09, 2022 | 6:30 PM Updated Updated Dec 27, 2023 | 6:08 PM

సోషల్ మీడియా వేదికగా పరస్పరం బురద జల్లుకోవడం మళ్ళీ మొదలుపెట్టారు. ఆర్ఆర్ఆర్ విడుదల దగ్గరయ్యే కొద్దీ ఇదింకా పీక్స్ కు చేరుకునేలా కనిపిస్తోంది. నిజానికి ఇప్పటి జెనరేషన్ లో ఏ ఇద్దరు హీరోలకు లేనంత బాండింగ్ చరణ్ తారక్ ల మధ్య కనిపిస్తోంది.

సోషల్ మీడియా వేదికగా పరస్పరం బురద జల్లుకోవడం మళ్ళీ మొదలుపెట్టారు. ఆర్ఆర్ఆర్ విడుదల దగ్గరయ్యే కొద్దీ ఇదింకా పీక్స్ కు చేరుకునేలా కనిపిస్తోంది. నిజానికి ఇప్పటి జెనరేషన్ లో ఏ ఇద్దరు హీరోలకు లేనంత బాండింగ్ చరణ్ తారక్ ల మధ్య కనిపిస్తోంది.

Fan Wars : మేమంతా ఒకటే అన్న హీరోల మాటలు వినరా

ఎన్ని బహిరంగ వేదికల మీద మేమంతా ఒక్కటే అని హీరోలు ఎంత మొత్తుకున్నా కింది స్థాయిలో అభిమానుల ప్రవర్తన దానికి భిన్నంగా ఉంది. సోషల్ మీడియా వేదికగా పరస్పరం బురద జల్లుకోవడం మళ్ళీ మొదలుపెట్టారు. ఆర్ఆర్ఆర్ విడుదల దగ్గరయ్యే కొద్దీ ఇదింకా పీక్స్ కు చేరుకునేలా కనిపిస్తోంది. నిజానికి ఇప్పటి జెనరేషన్ లో ఏ ఇద్దరు హీరోలకు లేనంత బాండింగ్ చరణ్ తారక్ ల మధ్య కనిపిస్తోంది. ఆన్ స్క్రీన్ మీదే కాదు బయట కూడా ఎంత స్నేహంగా ఉంటారో ఫోటోలు వివిధ సందర్భాల్లో బయట పెట్టుకుంటూనే ఉంటారు. ఇలాంటి ఫ్రెండ్ షిప్ అందరికీ ఉంటే ఎంత బాగుంటుందోననే కామెంట్స్ చాలా సార్లు వినిపించాయి కూడా. ఇది నిజం.

కానీ ఫ్యాన్స్ మాత్రం ఇదేదీ పట్టనట్టు మా హీరో ఎక్కువంటే మా హీరో ఎక్కువని అవసరం లేని పోలికలు, దేనికీ ఉపయోగపడని పాత కలెక్షన్ల రికార్డులు బయటికి తీసుకొచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారు. అసలు సినిమా విడుదల కాకుండానే గొప్పలు చెప్పుకోవడం షురూ చేశారు. ఇది వైరస్ లాగా పాకిపోయి అసలు ఎలాంటి ఉద్దేశాలు లేని న్యూట్రల్ మూవీ లవర్స్ కూడా వీటి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. దీని వల్ల ఆర్థికంగా వచ్చే ఇబ్బంది ఎవరికీ లేదు కానీ లేనిపోని ప్రచారాలతో రేపు థియేటర్ల దగ్గర ఏదైనా గొడవ జరిగినా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా దానికి పునాదులు ఇక్కడే మొదలయ్యాయనే వాస్తవం మర్చిపోకూడదు.

ఇప్పుడే ఇలా ఉంటే ఆర్ఆర్ఆర్ విడుదల రోజు థియేటర్లు, బెనిఫిట్ షో టికెట్ల పంపకాలు తదితర వ్యవహారాలు వాతావరణాన్ని మరింత వేడిక్కించడం ఖాయం. మల్టీ స్టారర్లు తీయడం ఒక ఎత్తు ఇలా అర్థం లేని అభిమానుల అంచనాలను బాలన్స్ చేయడం ఒక ఎత్తు. అందుకే మనవాళ్ళు ఎప్పుడో వీటికి దూరంగా ఉండటం మొదలుపెట్టారు. అప్పుడెప్పుడో మహాసంగ్రామం, అశ్వమేథం లాంటి సినిమాల తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దాకా మధ్యలో పెద్దగా రాలేదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మరెన్నింటికో స్ఫూర్తినిస్తుందనుకుంటే ఇలాంటి ఫ్యాన్ వార్స్ ఏ మాత్రం సమర్ధనీయం కాదు. దీనికి సరైన సమాధానం రాజమౌళి సినిమాలోనే చెబుతారు

Also Read : Aadavallu Meeku Johaarlu : పోటీ పడుతున్న ఓటిటి ప్రీమియర్లు