iDreamPost
android-app
ios-app

ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా? పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు!

  • Author Soma Sekhar Published - 10:00 PM, Mon - 28 August 23
  • Author Soma Sekhar Published - 10:00 PM, Mon - 28 August 23
ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా? పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు!

టాలీవుడ్ కు ప్రతీ సంవత్సరం పదుల సంఖ్యలో హీరోయిన్లు వస్తుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుంటారు. ఇక మరికొందరు మాత్రం ఎన్ని సినిమాలు చేసినా.. ప్రేక్షకులు వారిని పట్టించుకోరు. ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను మీరు గుర్తు పట్టారా? ఎక్కడో చండీగఢ్ లో పుట్టి టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తన తొలి మూవీనే స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో చేసింది. అదికూడా పూరీ తమ్ముడిని హీరోగా పెట్టి తీసిన సినిమాలో.. ఇప్పటికైనా గుర్తుపట్టారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న అందాల సోయగం పేరు సమీక్ష. పంజాబీ ఫ్యామిలీకి చెందిన ఈ బ్యూటీ.. ముంబైకి వచ్చి మోడలింగ్ మెుదలు పెట్టింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ కంట్లో పడింది. దీంతో ఈ అమ్మడుకి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు డాషింగ్ డైరెక్టర్. తన తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా తెరకెక్కించిన 143 మూవీలో హీరోయిన్ గా సమీక్ష నటించింది. ఈ మూవీలో యాక్టింగ్ కు ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత తమిళ, కన్నడ, హిందీ మూవీస్ లో నటించింది. తెలుగులో కొత్త కథ, ఇదీ సంగతి, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, సామ్రాజ్యం, దడ, కులుమనాలి లాంటి చిత్రాల్లో నటించింది. కానీ వీటిల్లో ఏ ఒక్క చిత్రం కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు.

దీంతో ఈ అమ్మడుకు పెద్దగా ఛాన్స్ లు కూడా రాలేదు. సినిమాలు తగ్గిపోవడంతో.. సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ బిజీ అయిపోయింది. కాగా.. 2020లో సింగర్ షాహిల్ ఒస్వాల్ ని పెళ్లి చేసుకుని సింగపూర్ లో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం సమీక్ష వయసు 37 సంవత్సరాలు కాగా.. టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది. వివాహం తర్వాత సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది ఈ సోయగం. తన లేటెస్ట్ ఫొటోలను, అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మరి చూడగానే సమీక్షను ఎంత మంది గుర్తించారో కామెంట్స్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Samiksha Shael Oswal (@iamsameksha)


ఇదికూడా చదవండి: ‘జైలర్’ మూవీకి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్ట్!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet