iDreamPost
android-app
ios-app

గోపీచంద్ పై యజ్ఞం డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు!

  • Published Aug 31, 2023 | 7:31 PM Updated Updated Aug 31, 2023 | 7:31 PM
  • Published Aug 31, 2023 | 7:31 PMUpdated Aug 31, 2023 | 7:31 PM
గోపీచంద్ పై యజ్ఞం డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు!

డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి ప్రస్తుతం రాజ్ తరుణ్ తో తిరగబడరాసామి సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హీరోగా రాజ్ తరుణ్ కు- డైరెక్టర్ గా ఏఎస్ రవికుమార్ కు బ్రేక్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత రాజ్ తరుణ్ ఒక యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాడని డైరెక్టర్ వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏఎస్ రవికుమార్ హీరో గోపీచంద్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు వాడు ఒక హీరోనేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విలన్ ను హీరోగా మార్చాను అంటూ చెప్పుకొచ్చారు.

ఏఎస్ రవికుమార్ అనగానే అందరికీ ముందుగా యజ్ఞం సినిమానే గుర్తొస్తుంది. ఆరోజుల్లో ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. అలాగే విలన్ ఇమేజ్ ఉన్న గోపీచంద్ కు హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి బాగా దోహద పడ్డ సినిమా అది. ఆ మూవీ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ హీరో గోపీచంద్ పై పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరగబడరాసామి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. “నేను హిట్స్ ఇచ్చిన హీరోలే ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. మేము సినిమాలు చేసే సమయంలో చెట్ల కింద కూర్చుని భోజనం చేసేవాళ్లం. ఇప్పుడు వాళ్లను కలవాలి అంటే ఐదారుగురిని దాటుకు వెళ్లాలి. నా పుట్టినరోజుకి వచ్చావ్.. నేను తుమ్మినా దగ్గినా వచ్చావ్. మరి ఇప్పుడు అంత బలుపు దేనికి.

రవికుమార్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు అంటే.. కాసేపు వెయిట్ చేయమను అంటావా? అంత బలిసిందా నీకు? అది చాలా తప్పు. విలన్ గా ఉన్న నిన్ను నేను హీరోగా చేశాను. మేకప్ వేసుకున్నాక మేకాలంటి చేష్టలు చేస్తారు. ఇండస్ట్రీలో అలా చేసేవాళ్లు చాలామంది హీరోలే ఉన్నారు” అంటూ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏఎస్ రవికుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల హీరోయిన్ మన్నారా చోప్రాకి ముద్దు పెట్టిన విషయంలో కూడా డైరెక్టర్ రవికుమార్ స్పందించిన విషయం తెలిసిందే. తాను ముద్దు పెట్టిన అంశాన్ని ట్రోల్ చేయడంపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తానేమీ కసిగా ముద్దు పెట్టుకోలేదని.. ఆప్యాయతగా పెట్టుకున్నాను అన్నారు. అయినా తన భార్య, మన్నారా చోప్రాకి లేని నొప్పి వీళ్లకెందుకు అంటూ తిరిగి ప్రశ్నించారు. తన సినిమా కోసం మన్నారా చోప్రా ఎంతో కష్టపడిందని.. అందుకే అలా ఆప్యాయతతో ముద్దు పెట్టుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş