iDreamPost
android-app
ios-app

హీరోయిన్ కి ముద్దు పెట్టడంపై ఏఎస్ రవి షాకింగ్ కామెంట్స్!

  • Published Aug 30, 2023 | 6:25 PM Updated Updated Aug 30, 2023 | 6:25 PM
  • Published Aug 30, 2023 | 6:25 PMUpdated Aug 30, 2023 | 6:25 PM
హీరోయిన్ కి ముద్దు పెట్టడంపై ఏఎస్ రవి షాకింగ్ కామెంట్స్!

చాలా గ్యాప్ తర్వాత డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ మళ్లీ సినిమా తెరకెక్కిస్తున్నారు. రాజ్ తరుణ్ హీరోగా తిరగబడరాసామి అనే టైటిల్ తో యాక్షన్ ప్యాక్డ్ లవ్ స్టోరీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి టీజర్ కూడా విడుదల చేశారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీతో అటు ఏఎస్ రవికుమార్ చౌదరి.. ఇటు రాజ్ తరుణ్ కు మంచి హిట్ రాబోతోంది అంటూ ఇప్పటి నుంచి ఇండస్ట్రీలో టాక్ మొదలైపోయింది. టీజర్ రిలీజ్ కార్యక్రమంలో డైరెక్టర్ మన్నారా చోప్రాకు ముద్దు పెట్టడం వివాదాస్పదం అయింది. ఈ ఇష్యూపై డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ స్పందించాడు.

యజ్ఞం సినిమాతో ఏఎస్ రవికుమార్ కు మంచి హిట్ లభించింది. అయితే తర్వాత బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరభద్ర మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్న అందించలేదు. తర్వాత పలు చిత్రాలకు స్రీన్ ప్లే, రైటర్ గా చేసినా అవేమీ ఏఎస్ రవికుమార్ కు గుర్తింపు తీసుకురాలేదు. తర్వాత ఆయన కూడా ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఒక యాక్షన్ ప్యాక్డ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఈవెంట్ లో మీడియా ముందు ఫొటోలకు ఫోజులు ఇస్తున్న సమయంలో డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ మన్నారా చోప్రా భుజంపై చేయి వేసి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నారు. ఆ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ ప్రవర్తనపై నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అలాంటి ప్రవర్తన అసలు ఆమెదయోగ్యం కాదంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్ పై డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ ఓపెన్ కామెంట్స్ చేశాడు. అసలు హీరోయిన్ కి లేని నొప్పి మీకేంటి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఆప్యాయతతో అలా ముద్దు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు. “అసలు నేను మన్నారా చోప్రాను ముద్దు పెట్టుకుంటే తప్పేంటి? నేను ఆమెను ఏమైనా కసిగా ముద్దు పెట్టుకున్నానా? నా కూతురుని కూడా అలాగే ముద్దు పెట్టుకున్నాను. నేను ఆమెను ఆప్యాయతగా ముద్దు పెట్టుకున్నాను. అయినా మన్నారాకి లేని నొప్పి, నా భార్యకు లేని నొప్పి మీకెందుకు. నా సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడింది. అందుకే ఆమెను అలా ముద్దు పెట్టుకున్నాను” అంటూ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş