iDreamPost
android-app
ios-app

ఢీ షోలోకి చమ్మక్ చంద్ర.. ఇదేం ట్విస్టు రా సామి!

  • Author Soma Sekhar Published - 05:14 PM, Thu - 6 July 23
  • Author Soma Sekhar Published - 05:14 PM, Thu - 6 July 23
ఢీ షోలోకి చమ్మక్ చంద్ర.. ఇదేం ట్విస్టు రా సామి!

బుల్లితెరపై ఎన్నో ఎంటర్ టైన్ మెంట్ షోలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంటాయి. అలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులు గెలుచుకున్న షో ‘ఢీ’. పేరుకు డ్యాన్స్ షో అయినప్పటికీ ఈ షోలో మస్త్ కామెడీ ఉంటుంది. ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఢీ ప్రీమియర్ లీగ్ పేరుతో 16వ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఇక ఈ సీజన్ కు యంకర్ గా ప్రదీప్ వ్యవహరిస్తుండగా.. టీమ్ లీడర్లుగా దీపికా పిల్లి, హైపర్ ఆది ఉన్నారు. అయితే తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర కనిపించి రచ్చ రచ్చ చేశారు. ఇక ఈ ప్రోమో చూసిన అభిమానులు ఇదేం ట్విస్ట్ రా బాబు అంటున్నారు.

చమ్మక్ చంద్ర.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని వెండితెరపై బిజీగా మారిన నటుడు. కేవలం ఒకే ఒక్క డైలాగ్ తో యూత్ నుంచి ముసలవ్వల దాక ఫేమస్ అయిపోయాడు. ఆ డైలాగ్ ఏంటంటే? ‘తీసుకోలేదా రెండు లక్షల కట్నం’ ఈ ఒక్క డైలాగ్ తో చంద్రకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక జబర్దస్త్ లో లేడీ గెటప్ లను పరిచయం చేసింది కూడా చంద్రానే కావడం విశేషం. అయితే కొన్ని సంవత్సరాల నుంచి జబర్దస్త్ మానేసి సినిమాలకే పరిమితం అయ్యాడు ఈ స్టార్ కమెడియన్.

ఇక చాలా సంవత్సరాల తర్వాత ఢీ షోలకు ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ షోలో కూడా తనదైన యాసతో, బాషతో నవ్వులు పంచాడు. ఆదితో కలిసి ఢీ షోపై రచ్చ రచ్చ చేశాడు. బుల్లితెరపై చంద్రను చూడటంతో.. ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని బుల్లితెరపై చూసి ఎన్నో రోజులు అవుతుందని, మీరు మళ్లీ జబర్దస్త్ కు రావాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక జబర్దస్త్ లో అప్పట్లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే టీమ్ లీడర్లలో తొలి స్థానం చమ్మక్ చంద్రదే అని చాలా మంది చెప్పుకొచ్చారు. మరి ఢీ షోలో కనిపించి.. సర్ప్రైజ్ చేసిన చంద్ర త్వరలోనే జబర్దస్త్ కు వస్తాడో? రాడో? తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Jojobet GirişmeritbetbetsmoveCasibom girişcasibomJojobet GirişcasibomcasibomcasibomjojobetartemisbetMadridbetMadridbetcasibom girişholiganbet girişganobetpokerklasjojobetMarsbahis GüncelCasibomJojobetGrandPashaBet destekDeneme bonusu veren siteler 2026jojobet girişCasibom GirişGrandPashaBet Şikayet