iDreamPost
android-app
ios-app

గత జీవితం గురించి చెబుతూ చమ్మక్‌ చంద్ర ఎమోషనల్‌!

  • Published Aug 20, 2023 | 2:25 PM Updated Updated Aug 20, 2023 | 2:25 PM
  • Published Aug 20, 2023 | 2:25 PMUpdated Aug 20, 2023 | 2:25 PM
గత జీవితం గురించి చెబుతూ చమ్మక్‌ చంద్ర ఎమోషనల్‌!

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిలదొక్కుకోవటం అంటే మామూలు విషయం కాదు. కొంతమందికి మొదటి అవకాశం రావటానికే ఏళ్లు పడుతుంది. అలా ఏళ్ల కష్టం తర్వాత సినిమా ఛాన్స్‌ వచ్చినా.. తర్వాత పరిస్థితి ఏంటన్నది లక్‌ మీద ఆధారపడి ఉంటుంది. టాలెంట్‌తో పాటు లక్‌ ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలం. అయితే, ఓ ప్రముఖ ఛానల్‌లో వచ్చే కామెడీ షో కారణంగా ఎంతో మంది కమెడియన్ల దశలు మారిపోయాయి. వారిని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలాంటి వారిలో చమ్మక్‌ చంద్ర ఒకరు.

ఆయన కామెడీ షోతో పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు. తర్వాత సినిమాల్లోనూ మంచి మంచి అవకాశాల్ని అందిపుచ్చుకున్నారు. ప్రస్తుతం ఓ వైపు షోలు చేస్తూ, మరో వైపు సినిమాల్లో బిజీ అయిపోయారు. తాజాగా, ఆయన ఓ ఇంటర్వ్యూలో తన గత జీవితం గురించి చెబుతూ ఎమోషనల్‌ అయ్యారు. సినిమాల్లోకి రాకముందు తన పరిస్థితి గురించి చెబుతూ బాధపడ్డారు. ఆయన మాట్లాడుతూ..‘‘ చిన్నప్పటినుంచి నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. సినిమా పోస్టర్‌ మీద కమెడియన్‌ ఫొటో ఉంటే చాలు ఆ సినిమాకు పోయేవాడిని. కామెడీతో పాటు నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఆయన డ్యాన్స్‌ అంటే ప్రాణం.

ఏవైనా ఫంక్షన్లలో ఆయన పాటలు పెట్టి డ్యాన్సులు వేసే వాడిని. చిన్నపుడు మా నాన్నతో కలిసి కట్టెలు అ‍మ్మడానికి వెళ్లేవాడిని. ఆ డబ్బులతో బియ్య కొనుక్కునే వాళ్లం. మా వాళ్లు ఇచ్చిన ప్రోత్సాహంతో హైదరాబాద్‌ వచ్చా. రెండేళ్ల పాటు ఓ ఇన్‌స్టిట్యూట్‌లో చేరా. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డా. నాకు ధనరాజ్‌ అప్పుడే పరిచయం అయ్యాడు. నేను ఒంటరిగానే కష్టపడి ఎదిగాను. ఏం జరిగినా భరించాలని నిశ్చయించుకున్నా. అందుకే సక్సెస్‌ సాధించాను’’ అని అన్నారు. మరి, చిన్న పల్లెటూరి నుంచి వచ్చి సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న చమ్మక్‌ చంద్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişmeritbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom