iDreamPost
android-app
ios-app

విడాకుల గురించి మాట్లాడ్డం విసుగ్గా ఉంది.. సమంత అంటే ఇప్పటికీ గౌరవమే: నాగ చైతన్య

విడాకుల గురించి మాట్లాడ్డం విసుగ్గా ఉంది.. సమంత అంటే ఇప్పటికీ గౌరవమే: నాగ చైతన్య

నాగ చైతన్య, సమంత విడిపోయి పది నెలలు దాటినా వాళ్ళ విడాకుల టాపిక్ ఇప్పటికీ హాట్ గానే ఉంది. సమంతా ఎప్పటికప్పుడు తన మనసులో విషయాలు బయటపెడుతున్నా చై మాత్రం దీనిపై పెద్దగా స్పందించింది లేదు. కానీ ఇప్పుడు లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ లో భాగంగా చైతన్య మెల్లమెల్లగా పెదవి విప్పుతున్నాడు. సమంతా అంటే తనకు చాలా గౌరవముందని చై ఓ ఎంటర్టెయిన్మెంట్ వెబ్ సైట్ కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. “ఇద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం, ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గౌరవముందని చైతూ వివరించాడు. సమంతా ఏం చేసినా దాన్ని తాను గౌరవిస్తానన్నాడు. “మేం చెప్పాల్సింది చెప్పాం. కానీ కొందరు తమకు నచ్చినవి ఊహించుకుంటున్నారు. విడాకుల తర్వాత నావి మూడు సినిమాలు వచ్చాయి. అయినా జనం ఇంకా నా వ్యక్తిగత విషయాల గురించే మాట్లాడుతున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు విసుగ్గా అనిపిస్తుంది” అని చైతూ సహనం వ్యక్తం చేశాడు.

వ్యక్తిగత జీవితానికి, ప్రొఫెషనల్ లైఫ్ కి మధ్య బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నారా అన్న ప్రశ్నకు నాగ చైతన్య అవునన్నాడు. “కాబట్టే ఇలా ఉన్నా” అని చమత్కరించాడు. రెండింటి మధ్య గీత గీసుకుని ఒకదానితో ఒకటి కలిసిపోకుండా జాగ్రత్త తీసుకోవాలని చై అభిప్రాయపడ్డాడు. “న్యూస్ దేముంది? ఈరోజొకటొస్తుంది రేపు ఇంకొకటి వస్తుంది. సినిమాల మీదే ఫోకస్ చేసి జనానికి వినోదం పంచడం మీదే దృష్టి పెట్టాలి” అంటూ తాత్విక ధోరణిలో మాట్లాడాడీ థ్యాంక్యూ హీరో.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş