iDreamPost
android-app
ios-app

హీరోయిన్స్‌ అమలాపాల్‌, లక్ష్మీ రాయ్‌లపై కేసు.. ఇకపై తిప్పలు తప్పవా?

  • Published Jul 03, 2023 | 1:19 PM Updated Updated Jul 03, 2023 | 1:19 PM
  • Published Jul 03, 2023 | 1:19 PMUpdated Jul 03, 2023 | 1:19 PM
హీరోయిన్స్‌ అమలాపాల్‌, లక్ష్మీ రాయ్‌లపై కేసు.. ఇకపై తిప్పలు తప్పవా?

ప్రముఖ స్టార్‌ హీరోయిన్స్‌ అమలాపాల్‌, లక్ష్మీరాయ్‌లపై నడిగర్‌ సంఘమ్‌లో కేసు నమోదైంది. ఈ ఇద్దరిపై యాక్టర్స్‌ అసోసియేషన్‌ ఫిర్యాదు చేయటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరి కారణంగా తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తోటి నటీ,నటులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు నటీ,నటులు తమ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. ‘‘ హీరోయిన్స్‌ అమలాపాల్‌, లక్ష్మీరాయ్‌లు షూటింగ్‌కు స్పాట్‌కు పెద్ద ఎత్తున బాడీగార్డ్స్‌ను తీసుకువస్తున్నారు. పది కంటే ఎక్కువ మంది బాడీగార్డ్స్‌ను షూటింగ్‌ స్పాట్‌కు తీసుకువచ్చి ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎక్కువ మంది బాడీగార్డ్స్‌ షూటింగ్‌ స్పాట్‌లో తిరగటం కారణంగా షూటింగ్‌కు తరచుగా అంతరాయం కలుగుతోంది’’ అని పేర్కొన్నారు.

కాగా, అమలాపాల్‌ ప్రస్తుతం మలయాళంలో ఆడు జీవితం, ద్విజ అనే సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. అమలాపాల్‌ ఈ రెండు సినిమాలతో పాటు తమిళంలో ‘అదో అంద పార్వయ్‌ పోల’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఆలస్యం అవుతోంది. ఇక, లక్ష్మీరాయ్‌ విషయానికి వస్తే.. ఈమె మలయాళంలో ‘డీఎన్‌ఏ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. వీరిద్దరూ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఈ నేపథ్యంలోనే వివాదంలో చిక్కుకున్నారు. ఈ వివాదంపై అమలాపాల్‌నుంచి కానీ, లక్ష్మీరాయ్‌ గురించి కానీ, ఎటువంటి స్పందన రాలేదు.

యాక్టర్స్‌ అసోసియేషన్‌ చేసిన ఫిర్యాదుపై నడిగర్‌ సంఘం ఏ విధంగా స్పందిస్తుంది? అమలాపాల్‌, లక్ష్మీరాయ్‌లపై ఎమైనా చర్యలు తీసుకుంటుందా? దీనిపై ఆ ఇద్దరు హీరోయిన్లు ఎలా స్పందిస్తారు? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇలా హీరోయిన్స్‌పై యాక్టర్స్‌ అసోసియేషన్‌ ఫిర్యాదు చేయటం ఇదే మొదటి సారిగా తెలుస్తోంది. అది కూడా వారి వ్యక్తిగత భద్రత విషయంపై ఫిర్యాదు చేయటం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి, స్టార్‌ హీరోయిన్లు అమలాపాల్‌, లక్ష్మీరాయ్‌లపై యాక్టర్స్‌ అసోసియేషన్‌.. నడిగర్‌ సంఘంలో ఫిర్యాదు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss