iDreamPost
android-app
ios-app

మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తమ్ముడు! ఏడ్చేసిన బేబి హీరోయిన్

  • Author Soma Sekhar Published - 08:27 PM, Fri - 1 September 23
  • Author Soma Sekhar Published - 08:27 PM, Fri - 1 September 23
మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తమ్ముడు! ఏడ్చేసిన బేబి హీరోయిన్

రాఖీ పండగ వచ్చిందంటే చాలు అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు ఒక్క చోటుకు చేరాల్సిందే. ఎంత దూరం ఉన్నా..ఏం చేస్తున్నా ఈ రోజు రాఖీ కట్టాల్సిందే. ఇక ప్రేమతో రాఖీ కట్టిన తన సోదరికి అన్న ఎంతో కొంత డబ్బు లేదా కానుకలు ఇవ్వడం మన సంప్రదాయంలో భాగం. అయితే తన సోదరుడు కూడా తనకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడని, అది చూసి తనకు ఏడుపు ఆగలేదని చెప్పుకొచ్చింది బేబి హీరోయిన్. అయితే ఆ గిఫ్ట్ రాఖీ పండగకు ఇచ్చింది కాదట.. తన బర్త్ డేకి ఇచ్చిందని తెలిపింది వైష్ణవి చైతన్య. మరి ఇంతకీ వైష్ణవి తమ్ముడు ఇచ్చిన ఆ గిఫ్ట్ ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

వైష్ణవి చైతన్య.. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బేబి’ మూవీలో వైష్ణవి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో.. ఆమె రేంజ్ పెరిగిపోయింది. చిన్న చిత్రంగా రిలీజ్ అయిన బేబి.. రూ. 90 కోట్ల మేర వసూల్ చేసింది. ఇక ఈ సినిమాలో వైష్ణవి నటకు మంచి మార్కులు పడ్డాయి. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. రాఖీ పండగ సందర్భంగా తన బర్త్ డే కానుకగా ఇచ్చిన సర్ప్రైజ్ గిప్ట్ గురించి చెప్పుకొచ్చింది. ఆ గిఫ్ట్ చూసి ఏడ్చేసినట్లు వెల్లడించింది.

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ..”మా తమ్ముడు నా పుట్టినరోజుకు మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అలా తన లెఫ్ట్ హ్యాండ్ పై వైషు అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఫస్ట్ అది చూసిన నేను నిజమైన టాటూ అనుకోలేదు. ఏదో జోక్ చేస్తున్నాడని అనుకున్నా. కానీ తర్వాత అది నిజమైన టాటూనే అని తెలిసి.. ఏడ్చాను. వాడు ఈ టాటూ వేయించుకోవడానికి మూడు గంటలు పట్టిందట! రాఖీ కడితే.. ఇదే గిఫ్ట్ అంటూ చూపిస్తున్నాడు” అంటూ చెప్పుకొచ్చింది వైష్ణవి. రాఖీ పండుగ సందర్భంగా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంది బేబి బ్యూటి. ఇక ఈ మూవీ బంపర్ హిట్ కావడంతో.. వరుసగా అవకాశాలు తలుపుతడుతున్నాయి ఈ అమ్మడికి.

 

View this post on Instagram

 

A post shared by Nitish_Cueboy (@nitishcueboy)