iDreamPost
android-app
ios-app

సినిమా చూసి హీరోయిన్ పోస్టర్ ని చెప్పుతో కొట్టిన వ్యక్తి! వీడియో వైరల్!

  • Author ajaykrishna Published - 09:32 AM, Wed - 19 July 23
  • Author ajaykrishna Published - 09:32 AM, Wed - 19 July 23
సినిమా చూసి హీరోయిన్ పోస్టర్ ని చెప్పుతో కొట్టిన వ్యక్తి! వీడియో వైరల్!

కొన్నిసార్లు కొన్ని సినిమాలు చూశాక ప్రేక్షకులు కూడా చాలా వింతగా ప్రవర్తిస్తుంటారు. సినిమాలలో చూసిన క్యారెక్టర్స్ కి బాగా కనెక్ట్ అయిపోయి.. బయటికి వచ్చాక ఆయా క్యారెక్టర్స్ ని తిట్టడం చూశాం. కానీ.. సినిమాలో క్యారెక్టర్ ని తన రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ తో కనెక్ట్ చేసుకొని.. దుర్భాషలాడుతూ సదరు హీరోయిన్ పోస్టర్ ని చెప్పుతో కొట్టేవరకు వెళ్లడం షాక్ కి గురిచేస్తోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్స్ గా నటించిన కొత్త సినిమా ‘బేబీ’. ఇటీవల విడుదలైన ఈ సినిమాని ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించారు. అలాగే సినిమాలో ట్రాజిక్ ఎండింగ్ ని కూడా చూపించారు.

ఇక రిలీజ్ అయినప్పటి నుండి పాజిటివ్ టాక్ తో.. అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమాకి.. యూత్ ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు. లవ్ లో అమ్మాయి చీటింగ్ చేయడం.. వేరే అబ్బాయితో కనెక్ట్ అవ్వడం అనేది ఎవరికైనా జీర్ణించుకోలేని విషయం. బేబీ సినిమాలో ఈ పాయింట్ కి కనెక్ట్ అవుతున్న యూత్.. తమ రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని గుర్తు చేసుకొని డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి బేబీ సినిమా చూసి.. బయటికి వచ్చాక హీరోయిన్ వైష్ణవి పోస్టర్ పై చెప్పుతో కొట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం సదరు వ్యక్తి పోస్టర్ ని చెప్పుతో కొట్టిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సినిమాలో క్యారెక్టర్ చూసే హీరోయిన్ పోస్టర్ కనిపిస్తే దాడి చేసే ఆలోచనలు వస్తున్నాయంటే.. ఖచ్చితంగా లవ్ లో ఫెయిల్ అయిన అబ్బాయిలు బాగా కనెక్ట్ అవుతున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే.. సినిమాలో చూసిన క్యారెక్టర్ ని ఓన్ చేసుకొని.. థియేటర్ నుండి బయటికి వచ్చేటప్పుడు కూడా తిట్టుకుంటూ రావడం రేర్ గా జరుగుతుంది. అప్పుడెప్పుడో శింబు నటించిన మన్మధ, అల్లరి నరేష్ నటించిన నేను, రవితేజ అల్లరి నరేష్ నటించిన శంభో శివ శంభో సినిమాలలో అమ్మాయిల క్యారెక్టర్స్ కి విపరీతంగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. అంతేగాక బయటికి వచ్చాక ఆ క్యారెక్టర్స్ కి అలాగే జరగాలంటూ తిట్టుకున్నారు కూడా. అంతలా ప్రభావితం చేశాయి ఆయా సినిమాలలో మోసం చేసిన అమ్మాయిల క్యారెక్టర్స్. సో.. ప్రస్తుతం బేబీలో వైష్ణవి క్యారెక్టర్ కూడా అలాంటిదే కావడంతో ఇలా రియాక్ట్ అవుతున్నారు. మరి వైష్ణవి పోస్టర్ పై చెప్పుతో దాడి చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetfixbetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş