iDreamPost
android-app
ios-app

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జనతా గ్యారేజ్ నటి!

  • Author Soma Sekhar Published - 03:22 PM, Sat - 15 July 23
  • Author Soma Sekhar Published - 03:22 PM, Sat - 15 July 23
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జనతా గ్యారేజ్ నటి!

కొంతమంది సెలబ్రిటీలు తమకు సంబంధించిన పర్సనల్ విషయాలను ఎవ్వరికీ తెలియకుండా ఉంచేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. తమ ఇంట్లో ఏదైనా విశేషం జరిగితే.. ఆ విషయాన్ని అంత త్వరగా బయటపెట్టడానికి సదరు సెలబ్రిటీలు ఉత్సాహం చూపించరు. కాగా.. జనతా గ్యారేజ్ మూవీ నటి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె ఈనెల 11న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

విదిషా శ్రీవాస్తవ.. బాలీవుడ్ తో పాటుగా తెలుగులో సైతం సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2007 లో విడుదల అయిన ‘మా ఇద్దరి మధ్య’ అనే సినిమా ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో అలా, ప్రేమ్, అత్తిలి సత్తిబాబు LKG లాంటి సినిమాల్లో నటించింది. హీరో శ్రీకాంత్ తోనూ ఓ మూవీలో యాక్ట్ చేసింది. కాగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలోనూ మెరిసింది ఈ అమ్మడు.

అయితే జూలై నుంచి విదిషా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. దానికి కారణం ఏంటి అని ఆరా తీయగా.. తను ప్రెగ్నెన్సీ కారణంగానే డెలివరీకి 10 రోజుల ముందు నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఆమె ఎక్కడా తెలియపరచలేదు. ఈ క్రమంలోనే ఈనెల 11న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది విదిషా. 2018లో విదిషా తన బాయ్ ఫ్రెండ్ సాయిక్ పాల్ ని పెళ్లి చేసుకుంది. అయితే ఈ విషయాన్ని నాలుగేళ్ల పాటు దాచి.. గత ఏడాది తాను బనారస్ లో పెళ్లి చేసుకున్న విషయాన్ని ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచింది. తాజాగా ఈ విదిషా దంపతులు మెుదటి బిడ్డకు స్వాగతం పలికి.. జీవితంలో ఆనందాన్ని నింపుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Charrul Malik (@charulmalik)

 

View this post on Instagram

 

A post shared by Vidisha Srivastava (@vidishasrivastava)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet