iDreamPost
android-app
ios-app

రెండోసారి ప్రెగ్నెన్సీ.. షాకింగ్ విషయం బయటపెట్టిన హీరోయిన్!

  • Author Soma Sekhar Published - 03:49 PM, Fri - 11 August 23
  • Author Soma Sekhar Published - 03:49 PM, Fri - 11 August 23
రెండోసారి ప్రెగ్నెన్సీ.. షాకింగ్ విషయం బయటపెట్టిన హీరోయిన్!

సాధారణంగా సెలబ్రిటీలు తమ పర్సనల్ విషయాలను అభిమానులతో ఎక్కువగా పంచుకోరు. ఇందుకు కొంతమంది మినహాయింపు. కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం అనుకోకుండానే తమ లైఫ్ లో జరిగిన ఎవరికీ తెలియని విషయాలను వెల్లడిస్తూ ఉంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ రెండోసారి ప్రెగ్నెన్సీ అయినప్పుడు జరిగిన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. అయితే ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలీదని చెప్పడం గమనార్హం. మరి ఆ స్టార్ హీరోయిన్ ప్రెగ్నెన్సీ సమయంలో జరిగిన విషాదకర విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాణీ ముఖర్జీ.. బాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ హీరోయినో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన అందంతో, అభినయంతో బాలీవుడ్ ను ఓ ఊపుఊపింది. తాజాగా మెల్ బోర్న్ లో జరుగుతున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో రాణీ ముఖర్జీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తన జీవితంలో జరిగిన, ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఓ విషాద వార్తను బయటపెట్టింది. రాణీ ముఖర్జీ మాట్లాడుతూ..”నేటి సమాజం జీవితంలో జరిగిన ప్రతీ విషయాన్ని పబ్లిక్ గా చెప్తుంటే సినిమా ప్రమోషన్స్ కోసమే అని విమర్శలు చేస్తున్నారు. అందుకే నేను నా పర్సనల్ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడను. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. 2020లో నేను రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యాను. అయితే దురదృష్టవశాత్తు ఐదు నెలలకే నా బిడ్డను కోల్పోయాను. ఇది నా జీవితంలో జరిగిన భయంకర సంఘటన. అప్పుడు ప్రపంచం కోవిడ్ తో అల్లకల్లోలం అవుతోంది” అంటూ తన జీవితంలో జరిగిన విషాద విషయాన్ని బయటపెట్టింది.

ఇక ఈ విషాదం జరిగిన 10 రోజులకే నిర్మాత నిఖిల్ అద్వానీ నాకు ఫోన్ చేసి, డైరెక్టర్ చెప్పిన కథను నాకు వినిపించాడు. కానీ ఏదైనా బాధలో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడేందుకు ఇలాంటి సినిమాలు చేయాలని అనిపించి ఈ సినిమా ఒప్పుకున్నాను అంటూ రాణీ ముఖర్జీ చెప్పుకొచ్చింది. అయితే మెుదట మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే కథ విన్నప్పుడు నాకు నమ్మకం లేదు. కానీ నార్వే లాంటి దేశంలో ఓ భారతీయ కుటుంబం ఇన్ని ఇబ్బందులు పడుతుందా? అనిపించింది. కాగా.. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రం సాగరిక, అనురూమ్ దంపతుల నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇదికూడా చదవండి: బ్రేకింగ్‌: సినీ నటి జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş